కేసియార్ ఒక మహా వైభవోజ్వల వృక్షం
తెలంగాణ మాగాణానికి శ్రీకారం చుట్టిన ప్రాకారం
స్వాభిమానోద్యమానికి సంగ్రామభేరి
జై తెలంగాణ జనగర్జనారావమై శృంఖలాలను ఛేదించిన
గోల్కొండ జెండా ఢంకారావం
సర్వజన శ్రేయస్సుకై ప్రవహించిన పరమోత్కృష్ట బృహద్భగీరథ పథం
తెలంగాణ గుండె గుడిలో ఆనందతాండవమాడే చంద్రశేఖరం…
తెలంగాణ ప్రగతి రథాన్ని పరుగులెత్తించిన త్రిశతాధిక
పథకాల పథ చేతనం
లిప్తపాటు కాలమైనా తిమిరానికి తావివ్వని
తేజోపుంజ విద్యుల్లతల విభవం…
అన్నదాత ఇంట కన్నీటిని మటుమాయం చేసి
సిరులపంట పండించిన రైతుబంధు హృదయం
నీళ్లను వెనక్కి మళ్లించి నోళ్లెండిన బీళ్లను నిత్యహరిత
మళ్లుగా వెలిగించిన సుజల సుఫల సంభవం…
ప్రతి ఇంటి గడపను నీటితో అభిషేకించి, ఆడపడుచుల
(క)న్నీటి మోత వెతల్ని కడతేర్చిన అపర భగీరథ చరితం
తెలంగాణ ధ్వజాన్ని ..
అజరామరం చేసిన అజేయ తేజం…
కర్షక, కార్మికలోక నాయకుని జయజయధ్వాన జన్మదినోత్సవం
సతతహరిత పర్యావరణ పరిరక్షణ ప్రమోదోత్సవం
ముచ్చటైన మంగళ వృక్షార్చనం
శతాధిక వసంతాల చైతన్య కాంతులతో
బాపు నిన్న, నేడు, రేపు చూపు కావాలని
సబ్బండ వర్గాల ఏకోన్ముఖ గళ స్పందనం
సర్వేశ్వరానుగ్రహ సన్మంగళాశాసనం…
– మంత్రి శ్రీదేవి