జయ జయహే తెలంగాణ
జయ జనమన తెలంగాణ ॥జయ॥
ప్రత్యేక తెలంగాణా
ప్రకాశించు సుదినమిదే
బంగారు తెలంగాణా
రంగారే సమయమిదే
కరెంటు కష్టాలు తీర
కడుపేదలు సేదదీర
‘ఆసరా’ పథకాలతో
అలరారే తెలంగాణ ॥జయ॥
కాళేశ్వర గోదావరి
కదలి ఎల్లెడల పారగ
రూపొందిన ప్రాజెక్టులు
రూపుమాప నీటి కరువు
‘అపర భగీరథ’ యత్నం
ఆమెను సఫలీకృతం
దేశానికే ఆదర్శం
అయిపోవుటె అభిమతం ॥జయ॥
‘దశాబ్ది ఉత్సవాల’
దసరా నా తెలంగాణ
‘దళితబంధు’ – ‘రైతుబంధు’
మిళిత పథక తెలంగాణ
అంబరాన్ని చుంబించే
అంబేద్కర్ విగ్రహంతో
సరికొత్త ‘సచివాలయ’
సాధించిన తెలంగాణ
‘ఫ్లై ఓవర్’ కట్టడాల
‘హై ఫ్లేవర్’ తెలంగాణ ॥జయ॥