నిప్పుతోని
చెలగాటం కూడదని వాళ్ళు
నన్ను హెచ్చరిస్తున్నారు!
కానీ వాళ్ళకేంతెలుసు?
ఘనీభవించిన నాహృదయం
నీ నులి వెచ్చని ప్రేమ కోసం
పరితపిస్తుందని..!
వాళ్ళకేం తెలుసు?
నీ కవోష్ణ స్పర్శ వలన
రగిలిన తపన..
నాలో ప్రవహిస్తున్నదని!
వాళ్ళకేం తెలుసు..?
ఈ జ్వాల యొక్క సారం..
నాలో
కాంక్షలను మెరిపించే
నీలోని,
ఈ జ్వాల కొరకే
నేను జీవించేది..
నేను మరణించేది..!
ఆంగ్ల మూలం: వందనపాములపర్తి
అనువాదం: డాక్టర్.వి.వి.రామారావు