తెర తీశారు.. నాటకం మొదలైంది
ఆహో.. ఓహో.. అంటూ కేరింతలు కొట్టారు
అటూ ఇటూ దూకారు
మరో తెర తీశారు.. మూడో పాత్రధారి వచ్చారు
ముచ్చటగా నాటకం ముగించారు
ముఖాన రాసుకున్న పసుపు కుంకుమలు వదిలేశారు
నాటకం ముగింపులో సందేశం లేదు
ఒనగూడిన ఫలితం లేదు
బోలెడంత ద్రవ్యం వృథా
పస లేని నాటకంతో ప్రేక్షకులు నీరుగారిపోయారు
తెరవెనుక నాటకాన్ని గ్రహిస్తేనే చరిత్ర అర్థమౌతుంది
ఇద్దరి మధ్య దూరిన మూడోవాడి
ప్రయోజనమే ఎజెండాగా ముగిసిన తంతు
తంత్రం పారింది
రెచ్చిపోయిన బాకాలు మూతబడ్డాయి
– గిరి ప్రసాద్ చెలమల్లు 94933 88201