75 ఏండ్ల స్వతంత్ర భారతదేశం గర్విస్తున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రపంచ మేధావి ని కన్నందుకు ఈ భారతావని పులకించిపోతున్నది. దేశానికి దిక్సూచినిచ్చిన మహనీయుడు అంబేద్కర్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచినందుకు భరత మాత ఉప్పొంగి పోతున్నది. దేశం కోసం అహర్నిశలు తన కలంతో కవాతు చేసిన పోరాట యోధుడు, భరత ఖండ యుగ పురుషుడు బాబా సాహెబ్ అంబేద్కర్. ఇంతటి మహనీయుని సమున్నతంగా స్మరించుకోవడం ఈ దేశం బాధ్యత.
నరనరాల్లో దేశభక్తిని పుణికిపుచ్చుకున్న బాబా సాహెబ్.. మనుషుల మధ్య విబేధాలు సృష్టించి దేశాన్ని ముక్కలు చేయడం దేశ భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిదికాదని ఆనాడే చెప్పారు. వెయ్యేండ్ల దూరదృష్టితో భారత రాజ్యాంగాన్ని (సంవిధాన్) రాసిన అంబేద్కర్ రాజ్యాంగ హక్కులతో ప్రతి మనిషికి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చారు. రాజ్యాంగ బలమే ఈ రోజు భారత్‌కు బలగమై వెలుగుతోంది. అందుకే ఈ దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ జయం తిని ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుపు కొంటున్నది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బాబాసాహెబ్ జయంతి ఒక వేడుకలా జరుగుతున్నది. ఇంతటి గొప్ప గౌరవం ప్రపంచంలో ఏ నాయకుడికి దక్కి ఉండక పోవచ్చు.
ఆ మహానుభావుడి జయంతిని తెలంగాణ ప్రభు త్వం ఈసారి ఒక పండుగలా చేస్తున్నది. రాజ్యంగం లో రాసిన ఆర్టికల్ 3 ప్రకారం సంక్రమించిన తెలంగాణ రాష్ట్రం బాబాసాహెబ్‌ను ఘనంగా స్మరించుకుంటున్నది. అంబేద్కర్ ఆశయాలకు అను గుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి నిలువెత్తు నిదర్శనమే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. ఒక పక్క అద్భుతమైన కట్టడం తెలంగాణ సచివాల యం. దాని పక్కనే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. ఇక్కడ అంబేద్కర్ చేతి వేలు హుసేన్ సాగర్‌లో ఉన్న గౌతమ బుద్ధుని వైపు చూపుతోంది. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం తో ఈ ప్రాంతానికే కొత్త కల వచ్చేసింది. ఇదే ప్రాంతం లో ఇద్దరు మాజీ ప్రధానుల విగ్రహాలు కూడా ఉన్నా యి. ఈ దేశంలో ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధానిగా పని చేసిన ఏకైక నేత పీవీ నరసింహరావు విగ్రహం కూడా ఉన్నది. దేశానికి దిశానిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు దేశాన్ని పాలించిన ఇద్దరు ప్రధానుల విగ్రహాలు ఉండటం.. వాటి నుంచి వెలువడే సందేశం దేశానికే తలమానికం.
బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ రాజ్యాంగంలో మహిళలకు సముచిత స్థానం కల్పించారు. మహిళలకు అంతకు ముందు లేని ఎన్నో హక్కులు కల్పించారు. సచివాలయం వద్ద కనిపించే అంబేద్కర్, ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావు, గౌతమ బుద్ధుడు విగ్రహాలన్నీ యాదృచ్ఛికంగా పక్కపక్కనే ఉన్నప్పటికీ అవి దేశ భవిష్యత్తుకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ గడ్డమీద 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యడమే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు షెడ్యూల్ కులాల పట్ల ఉన్న దృక్పథాన్ని తెలియజేస్తున్నది. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అడుగులు వేస్తున్న కేసీఆర్ ఆలోచన ధోరణి ఏమిటో ఈ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల కోసం అమలు జరుపుతున్న అభివృద్ధి పథకాలే చెప్తున్నాయి. ‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా అంబేద్కర్ కా నామ్ రహే’గా అన్నట్టు చరిత్ర ఉన్నంతకాలం తెలంగాణ సచివాలయంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు ఉంటుంది.
ఆర్థికంగా షెడ్యూల్ కులాల ప్రజలు బలపడాలి అని అంబేద్కర్ కన్న కలలను సాకారం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ సబ్‌ప్లాన్, దళిత బంధు వంటి వినూత్న పథకాలను అమలు పరుస్తున్నది. దళిత బంధు పథకం కొద్దీ రోజుల క్రితమే ప్రారంభమైయినప్పటికీ ఈ పథకం వల్ల అనేక మంది జీవితాల్లో వెలుగులు నిండాయి. నేరుగా లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక ప్రయోజనం చేకూర్చే దళితబంధు లాంటి పథకం బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని చెప్పవచ్చు. దేశంలో, ప్రపంచంలో సామాజిక, ఆర్థిక అంతరాలు ఉన్నం త కాలం వాటి నుంచి విముక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయా లు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాయి.
జానయ్య నీలం
(వ్యాసకర్త: వీసీ & ఎండీ టీఎస్ రెడ్కో)