గత ఎనిమిదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ నిర్ణయాలను పరిశీలిస్తే విఫలం, విషం, విద్వేషమే విధానంగా సాగుతున్నట్టు స్పష్టమవుతున్నది. ‘బలమైన కేంద్రం-బలహీనమైన రాష్ర్టాలు’ అనే సిద్ధాంతాన్ని బీజేపీ అవలంబిస్తున్నది. ఇటువంటి విధానాలను సహించేదే లేదని, వీటిని కేంద్ర ప్రభుత్వం విడిచిపెట్టి తీరాలని కేసీఆర్ స్థాపించిన ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీ గర్జిస్తున్నది.
కంచే చేను మేసిన చందంగా ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రం దేశంలోని లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వావలంబన, సామాజిక న్యాయం, సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నది. భారత్‌ను మతతత్వ దేశంగా మార్చి ఎర్రకోటపై త్రివర్ణ పతాకం బదులుగా కాషాయ జెండాను ఎగురవేసేందుకు కుట్రలు పన్నుతున్నది. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే కొందరి చేత మనం ప్రేమించే మన మాతృభూమి భారతదేశం తీవ్రమైన దాడికి గురవుతున్నది. పౌరులందరికీ సమాన హక్కులతో కూడిన లౌకిక భారత భావనను బీజేపీ పాలకులు ఎన్నడూ అంగీకరించలేదు. మతం ప్రాతిపదికన పౌరసత్వాన్ని నిర్ణయించే దేశంగా భారత్‌ను మార్చటమనే భావనను వారు పలుమార్లు సమర్థించారు. ఈ దిశగా.. పౌరసత్వ సవరణ బిల్లు పేరుతో రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్‌ను మార్చడానికి మొదటి అడుగు వేశారు. కానీ, ప్రతిపక్షాల మద్దతుతో ఈశాన్య రాష్ర్టాల ప్రజలు ఈ కుట్రను విఫలం చేశారు. కానీ ఆ ప్రమాదం చాలా పెద్దది.
దేశంలో కరువవుతున్న లౌకికవాద విలువలను కాపాడేందుకు అందరం నడుం బిగించా లి. ఈ సమయంలో కొందరు మృదు హిందు త్వ రాజకీయాల వైపు మళ్లి రాజీపడటం మన కు కనిపిస్తుంది. కానీ, మన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎటువంటి రాజీ లేకుండా నిలబడింది. రాజకీయాల నుంచి మతాన్ని వేరుగా ఉంచాలనే ప్రాథమిక సూత్రా న్ని, ప్రగతిశీల విధానాన్ని బీఆర్ఎస్ దృఢంగా సమర్థించిందని మనం సగర్వంగా చెప్పుకోవ చ్చు. బీజేపీ హయాంలో విపరీతంగా పెరిగిపోయిన విద్వేషపూరిత ప్రసంగాలు, మతహింస కు వ్యతిరేకంగా సమగ్ర చట్టం కోసం బీఆర్ఎస్ తన స్వరాన్ని భవిష్యత్తులో జాతీయస్థాయిలో పెంచనున్నది. మతోన్మాదానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ చేసే పోరాటంలో ఇది అంతర్భాగం.
తాము అధికారంలో ఉన్న కేంద్రంలో, వివిధ రాష్ర్టాల్లో బీజేపీ నడుపుతున్నంత బహిరంగ పక్షపాత, మతతత్వ ప్రభుత్వాలను భారతదేశం మునుపెన్నడూ చూడలేదు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ నినాదం పూర్తిగా అబద్ధం. మిగతా అన్ని నినాదాల మాదిరిగానే దీన్ని కూడా మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దేశంలోని వైవిధ్యాన్ని నాశనం చేయ డం, అసత్యాలు, మత దురభిమానం ద్వారా సామాజిక నిర్మాణాన్ని చీల్చివేసి, హింసాకాండను సృష్టించటమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్ఎస్ఎస్ విషపూరిత భావజాలానికి ఈ ప్రభు త్వం ప్రాతినిధ్యం వహిస్తున్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకరమైన ఆర్థికవిధానాలు దేశాన్ని ప్రపంచంలోని అత్యంత అసమాన దేశాల్లో ఒకటిగా మార్చివేసింది. భారతదేశాన్ని మధ్యయుగ అంధకారంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నది మోదీ సర్కార్. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, దాని మిత్రపక్షాలను ప్రజలు తిరస్కరించడమే ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడే మార్గం. బీజేపీ-ఆర్ఎస్ఎస్పై పోరాటానికి పార్లమెంట్లో లౌకిక ప్రగతిశీల శక్తులను బలోపేతం చేయడం అవసరం. ఈ శక్తులు పార్లమెంట్లో బలమైన గొంతుకను కలిగి ఉన్నప్పుడు, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా రక్షణగా పనిచేయగలుగుతాయి. ఈ నేపథ్యంలోనే, బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది.
ప్రజాకంటక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని మోదీని ఇటు సమర్థించలేక, అటు ధిక్కరించలేక దిక్కులు చూస్తున్న రాజకీయ పార్టీలకు కేసీఆర్ ఒక ఆశా కిరణంలా కనిపిస్తున్నారు. కేసీఆర్ గురించి దేశంలో తెలియనివారు లేరు. విభిన్న సిద్ధాంతాలను కలిగిన 30కి పైగా రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ఘనచరిత్ర గురించి తెలియనివారు ఎవరున్నారు? అం దుకే మళ్లీ ఏదైనా జరగాలంటే, బీజేపీని దీటు గా ఎదుర్కొనగల నాయకత్వం కావాలంటే అందుకు కేసీఆరే సమర్థులని అనేక పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
అసహాయ శూరుడైన కేసీఆర్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అప్రతిహత పోరాటాన్ని కొనసాగించనున్నారు. బీఆర్ఎస్ను ఆరంభంలోనే దెబ్బతీయాలనే బీజేపీ చౌకబారు ఎత్తుగడలకు కేసీఆర్ వెరువరు. ఈ యుద్ధానికి ముగింపు హస్తినలోనే!
తెలంగాణను తల్లికోడిలా కాపాడుతున్న కేసీఆర్ కేంద్రంతో రాజ్యాంగబద్ధ సంబంధాలను కొనసాగిస్తూనే, మోదీ పోకడ ప్రమాదకరంగా ఉన్నదని చాలాముందుగానే తన సహజాతంతో పసిగట్టారు. గత ఎన్నికలకు ముందే అప్రమత్తమైన కేసీఆర్ ఇందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంటూ వచ్చారు. ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూలగొడుతున్న తీరు, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తు న్న విధానం కేసీఆర్ అంచనాలు నిజమేనని ధ్రువపరుస్తున్నది. అసహాయ శూరుడైన కేసీఆర్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అప్రతిహత పోరాటాన్ని కొనసాగించనున్నారు. బీఆర్ఎస్ను ఆరంభంలోనే దెబ్బతీయాలనే బీజేపీ చౌకబారు ఎత్తుగడలకు కేసీఆర్ వెరువ రు. ఖమ్మంలో మొదలుపెట్టబోతున్న యుద్ధానికి ముగింపు హస్తినలోనే!
2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జ న బహిరంగసభ స్వరాష్ట్ర ఆకాంక్షను ఏ స్థాయి లో ప్రతిబింబించిందో, అదేరీతిలో ప్రస్తుత దేశ గతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని మాపేందుకు ఉద్యమ పథగామి కేసీఆర్ కదన శంఖారావం పూరించనున్నారు. ఆ చారిత్రాత్మక సం దర్భానికి ఖమ్మం వేదిక కానున్నది. సెక్యులర్ భావాలు కలిగిన ప్రజలు ఖమ్మం జిల్లా వాసు లు. అక్కడ మతోన్మాద శక్తుల ఎత్తులు పారవు. మత ఘర్షణలకు తావులేదు. కేసీఆర్ సారథ్యం లో తెలంగాణ అంతటా సర్వమత సమాన త్వం పరిఢవిల్లుతున్నది. ఖమ్మంలో ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ‘భారత గర్జన’ జరగబోతున్నది. ప్రతి ఒక్కరూ దేశ ప్రయోజనాల రక్షణకు నడుం బిగించి ముందుకురావాలి.
జై భారత్! జై తెలంగాణ!!
పువ్వాడ అజయ్‌కుమార్
(వ్యాసకర్త: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి)