e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News మత విద్వేషం పట్ల మౌనమేల?

మత విద్వేషం పట్ల మౌనమేల?

హరిద్వార్‌లో 2021 డిసెంబర్‌ 28న జరిగిన ‘ధర్మసంసద్‌’లో పాల్గొన్న అఖాడాల (హిందూ బృందాల) నేతలు పలువురు మత విద్వేష ప్రసంగాలు చేశారు. ఆ సందర్భంగా వారు చేసిన ప్రసంగాలు ఒకదానికి మించి మరొకటి ఉన్నాయి. అందులో.. ముస్లింలను అంతమొందించి తీరుతామని ప్రతినబూనారు. ఇస్లాం వ్యతిరేక సాయుధ దళాలను తయారు చేస్తున్నామన్నారు. భారత్‌ను హిందూ రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు.

అఖాడాల విపరీత విద్వేషాలు గతంలో ఎన్నడూ లేని, వినని స్థాయిలో హరిద్వా ర్‌లో శృతి మించాయి. ఇస్లాంను విశ్వసించని వారిని చంపాలని ప్రబోధిస్తున్న ఖురాన్‌ను నిషేధించాలన్నారు. ముస్లింలపై పోరాటానికి 21మంది అఖాడా నేతలతో ఒక కమిటీని కూడా వేశారు. అలీఘడ్‌, కురుక్షేత్ర, సిమ్లా ప్రాంతాల్లో మరో మూడు సంసద్‌లు నిర్వహిస్తామని ప్రకటించారు.ఈ సదస్సుకు బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. ఇంత జరుగుతున్నా ప్రధానిగా మీరు మౌనంగా ఉన్నారేంటి మోదీ జీ. వారు మాట్లాడిన మాటలకు మీ ఆమోదం ఉన్నదా? మీకు తెలియకుండానే ఆలా ప్రకటించారని అనుకోవాలా? మీరు ఎంత మౌనం వహించినా మీ ఉద్దేశం తెలిసిపోతూనే ఉన్నది.

- Advertisement -

బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ముస్లింలు, క్రైస్తవుల మీద మూక దాడులు జరిగాయి. దేశంలో ఏదో మూల ఇంకా జరుగుతూనే ఉన్నాయి. గో సంరక్షకుల అవతారమెత్తి భౌతికదాడులు,హత్యలు చేస్తూ బీభత్సాలు సృష్టిస్తున్నా మీరు పట్టించుకోవటం లేదు! ‘జిన్నా సమర్థకులను వ్యతిరేకించటం హిం దువుల విధి’ అని బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా ప్రకటించారు. ‘ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేందుకు చావటానికైనా, చంపటానికైనా తాము సిద్ధ’మని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రూపొందించిన ‘హిందూ వాహిని’ ప్రకటించింది. అయినా మీరు మౌనంగానే ఉంటున్నారు. ఇలా చట్ట విరుద్ధంగా మత విద్వేష ప్రసంగాలు చేస్తు న్నా.. మీ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ వంటి అంతర్జాతీయ పత్రికలు విమర్శిస్తున్నా మీ మౌనానికి అర్థమేంటి? వాటన్నింటినీ మీరు ఆమోదిస్తున్నారనే గదా!

ఇటీవల బంగ్లాదేశ్‌లో కొందరు ఉన్మాదులు ఆ దేశంలోని హిందువులపై దాడులు చేస్తున్నా, దాన్ని మీరు గట్టిగా ఖండించలేక పోయారు! కారణం.. మన దగ్గర కూడా అదే జరుగుతున్నదని మీరు భావించటంగా అనుకోవాలా! ‘దాడులు జరగకుండా తగు చర్యలు తీసుకోవలసింది’గా బంగ్లా ప్రధానిని మీరు కోరారు. అందుకు ప్రతిగా.. బంగ్లా ప్రధాని మీకు చేసిన సూచన ఏమిటి? ‘మా దేశంలోని కొందరు మత ఉన్మాద చర్యలకు ఊతమిచ్చే ఉన్మాద చర్యలు మీ దేశంలో జరక్కుం డా జాగ్రత్త పడ’మన్నారు. అంటే.. ఆ దేశం వైపు వేలెత్తి చూపటానికి ముందుగా, మన దేశంలో మూక ఉన్మాదుల చర్యలను అరికట్టమనే కదా మోదీజీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా తమ గౌరవానికి సదరు సూచన భంగకరంగా అనిపించటం లేదా!

‘పరమత విద్వేషం హైందవ ధర్మానికే విరుద్ధం’. ఉదాహరణకు.. ‘ఏకం సత్‌ విప్రా బహు ధా వదన్తి’.. అంటే- సత్యం (దైవం) ఒక్కడే. పండితులు మాత్రం (ఈశ్వర్‌, అల్లాహ్‌, యెహోవా వగై రా..) వివిధ నామాలతో పిలుస్తున్నారు అంటున్న ది రుగ్వేదం. గీత-4-11: ‘ఎవరే (హిందూ, ముస్లిం, క్రిస్టియ న్‌, సిక్కు, బౌద్ధ, జైన)మార్గాన ఉపాసించినా వారికి ఆ మార్గంలోనే అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తా ను’ అని గీత బోధించింది. వివి ధ మార్గాల గుండా (నదులన్నీ సముద్రాన్ని చేరినట్లు) భక్తులందరూ నన్నే చేరుకుంటారని తెలిపింది. గీత 13-34: ‘సూర్యుడొక్కడే లోకమంతటినీ ప్రకాశింప చేస్తున్నట్లు.. ఆత్మ ఒక్కటే ప్రాణులన్నింటినీ భాసింప
(చైతన్యవంతం)చేస్తున్నది’. ఈ వాస్తవాన్ని గ్రహించిన వారు ఎవరినీ ద్వేషించినా, హింసించినా వారిలో ‘ఆత్మ’గా ఉన్న సర్వేశ్వరుని ద్వేషించి, హింసించినట్లేనని తెలుసుకోగలుగుతారు. సదా ఈ సత్యాన్ని మననం చేసుకోవాలి.

బీజేపీతో సహా దేశంలోని పాలక వర్గాలన్నింటికీ చేస్తున్న విజ్ఞప్తి ఇది- ఓ పాలకులారా.. డబ్బుతో అధికారాన్ని కొనుక్కోవటం కన్నా.. మీ పార్టీల నిధుల కోసం దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టటం కన్నా, ప్రతిపక్షాలను అణచివేసేందుకు వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తుండటం కన్నా, ఇతర పార్టీలను కబ్జా చేయటం కన్నా, అధికారం కోసం కులమత విద్వేషాలను రెచ్చగొట్టటం ఘోర పాపం.

విద్వేషాలు రెచ్చగొట్టడం మన జాతీయ సమైక్యతకే పెను ప్రమాదం. అట్టి మతోన్మాద ప్రోత్సాహకులు శతృ దేశాల కన్నా ప్రమాదకారులు. దయచేసి ఆ పాపం మాత్రం చేయకండి. ఈ దేశంలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, జైన మతాల వారంతా భరత మాత బిడ్డలే. కావున పాలకులారా.. రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చు రేపకండి. అన్ని మతాల వారిలో ఉన్న ఆర్థిక అసమానతలను పేదరికాన్ని, నిరక్షరాస్యతను నిర్మూలించండి. అందరికీ కూడు, గూడు, గుడ్డ అందిస్తూ వారి జీవితాలకు భరోసా కల్పించండి. లేదా చరిత్ర పుటలలో కనుమరుగై పోతారు.

పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement