ద్వేషాలూ, కుళ్ళు కుతంత్రాలు
అతడిని విడదీయలేవు.
మానవత్వమే అతని రక్ష
దేన్నైనా ఎదుర్కునే ఘర్షణ
అది అతని నిరంతర తపన
కళలూ,శాస్ర్తాలూ కనుతెరిచినవి
కాలం గీసిన చిత్రంలో
గొప్పగా మాత్రమే బతికేందుకు !
స్పందించే హృదయం
మనిషి సొత్తు కాబట్టే
వివేచన అతని రూపం
ఉద్వేగం ఒక మనో నేత్రం
అవే మనిషిని మహర్షిగా
మహానేతగా నిలిపాయి!
అవే అవే అతని ఆలోచనలు
ఉలి శిలను శిల్పంగా చేస్తే,
కల మనిషిని మనిషిగా మారుస్తుంది
చరిత్రలో గొప్పగా నిలబెడుతుంది!
ఎంతకాలం బతికామన్నది కాదు
ఎంత గొప్పగా బతికామన్నదే గొప్ప జీవితం!
అలాంటి భావజాలమున్న వ్యక్తే
మన దేశానికి మార్గం కాబోతున్నాడు
అతను దేశంలో చైతన్యం తేవడానికి
ఈరోజు ఒక గుడిని దేశరాజధానిలో ప్రారంభించాడు
ఇవే అతనికి అక్షర అభినందనలు…..!
జై తెలంగాణ జై భారత్
కళ్లెం నవీన్‌రెడ్డి: 9963 691692