రాజంపేట సభలో చంద్రబాబు తన వేలుకున్న ఉంగరం చూపిస్తూ… ఇది వేలికి పెట్టుకుంటే నా శరీర పనితీరుపై ఎప్పటికప్పుడు నా ఫోన్‌కు సమాచారం పంపిస్తుందని వివరిస్తున్నారు. ఇంతలో ఒక కార్యకర్త లేచి… ‘అందులో టైమ్ మిషన్ కూడా ఉందా సార్’ అని అడిగారు. ‘అదెందుకు? దాని అవసరం ఏముంది?’ అని బాబు ప్రశ్నించారు. ‘టైమ్ మిషన్ కూడా ఉండి ఉంటే… ఎన్టీఆర్‌ను ఏ విధంగా మీరు గద్దె దించి సీఎం సీట్లో కూర్చున్నది, ఈ జనరేషన్‌కు తెలిసేది కదా సార్?’ అన్నారు. దీంతో చంద్రబాబుకు కోపం నషాలానికి అంటింది. ‘హేం మాట్లాడుతున్నావు… పిచ్చిపిచ్చిగా ఉందా?’ కూర్చో అని కసరడంతో సభ సైలెంటైపోయింది.
‘క్యా అమిత్ జీ… భాగ్యనగర్‌లో మన మీటింగ్ గురించి ఏమంటున్నారు?’
‘దానిగురించి ఏమంటలేరు కానీ… బండి సంజయ్ భుజం చరుస్తూ మీరు నవ్విండ్రు కదా? ఎందుకని అడుగుతున్నారు.’
‘నిజం చెప్పమంటవా?’
‘అందుకే కదా అడిగేది…’
‘అయితే విను… సభకు వచ్చినవారంతా.. నీవు అధ్యక్షుడివయ్యాకనే పార్టీలోకి వచ్చారా? అని వాళ్లను చూపిస్తూ అడిగా…’
‘మరి, బండి ఏమన్నాడు?’
‘అవును అన్నాడు…’
‘అందుకే ఈ నమో తోనే జోకులా? అని జబ్బపై ఒకటిచ్చా…’
– వెల్జాల