నింగికీ నేలకూ మధ్య
విచ్చుకున్న ఆకుపచ్చని ఛత్రమే
విస్తరిస్తున్న హరితహారం!
వనాలు ప్రేమలేఖలు రాయన్ది
ఆకాశం వలపు మబ్బులు అల్లుకోదు
చినుకు నేల రాలన్ది పుడమి పురుడు పోసుకోదు!
భూగోళాన్ని ఎడారిని చేసి
ఆకాశాన్ని ఎంత ప్రార్థించినా
ఆకలి దుఃఖం తీరదు!
ఎవరైనా ఒంగి ఓ మొక్కను నాటుతుంటే
జ్ఞానోదయమైన మనిషి
నేలతల్లికి మొక్కు చెల్లిస్తున్నట్లుంటది!
పర్యావరణానికి మనమంతా
వీర విధేయులమైతే తప్పా
గాలి నీరు ఆహారం నింగీ నేలా ప్రసాదించవు!
నాగరికతను నిర్వచించాలంటే
భాషా సంస్కృతులతోపాటు ఆ దేశపు
విస్తరించిన అరణ్యాలను లెక్కించాలి!
కట్టుకున్న మన ఆధునిక దేవాలయాలు
జలకళతో ఎగిసి పడాలన్నా
ఈ పుణ్యభూమి చెట్టయి ఊగి పోవాలి!
ఇకపై మనిషి చెట్టూ పుట్టా పట్టందే
ఉషోదయాలను కలగనలేడు
చెట్టుచాటు మనిషికి ఏ ఢోకా లేదు!!
–కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261