e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home ఎడిట్‌ పేజీ కాంగ్రెస్‌ కాదు స్కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ కాదు స్కాంగ్రెస్‌

గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంలో దళిత, గిరిజనుల ఆత్మగౌరవం పేరుతో ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ఒక సభ నిర్వహించింది. ఈ సభకు అనేక మందిని తరలించుకువచ్చింది. కానీ, ఆ వచ్చినవారు గజ్వేల్‌ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. ఆత్మగౌరవ చిహ్నాల నీడలో సేదదీరారు. గజ్వేల్‌ అభివృద్ధి చిహ్నాల దగ్గర చేరి సెల్ఫీలు దిగారు. ఇక్కడి అభివృద్ధిని చూసి కేసీఆర్‌ను పొగడటం మొదలుపెట్టారు. మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు మాత్రం ఆత్మవంచన చేసుకొని అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఇదీ గజ్వేల్‌లో జరిగిన కాంగ్రెస్‌ సభ విశేషం.

నలభై ఏండ్లు గజ్వేల్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులే ప్రాతినిథ్యం వహించారు. కానీ కనీ సం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. రోడ్లు, కరంటు, ఆరోగ్య వసతులను కూడా కాంగ్రెస్‌ నాయకులు కల్పించలేదు. గజ్వేల్‌ పేరే తెలువదు. గజ్వేల్‌ అని అడ్రస్‌ ఇస్తే కొరియర్‌, రవాణా, పోస్టల్‌ లెటర్లు అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న గద్వాల్‌కు వెళ్లిన సందర్భాలున్నాయి. ఏడేండ్లుగా అధికారం లేక విలవిలలాడుతున్న కాంగ్రెస్‌ నేతలు తమ ఉనికిని చాటుకునేందుకు సభలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ అంటే ‘స్కాంగ్రెస్‌’ అని ప్రజలకు తెలుసు. ఇల్లు కట్టకుండానే లేపే బిల్లులు, లేచిపోయే రోడ్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాగితాల మీద తప్ప అనుభవంలోకి రాని ప్రాజెక్టులు.. ఇదీ కాంగ్రెస్‌ సాధించిన ఘనత. వాళ్లకు అధికార దాహం తప్ప ప్రజల దాహార్తిని తీర్చాలనే ఆలోచన లేదు. ప్రజల కష్టాలను, కడగండ్లను తీర్చాలని వాళ్లెప్పుడూ ఆలోచించలేదు. ఇవ్వాళ తెలంగాణలో అమలవుతున్న పథకాలను, అభివృద్ధిని కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో చూపించగలరా?

- Advertisement -

2014 ఎన్నికల్లో కేసీఆర్‌ పోటీ చేసిన తర్వాతనే ఈ నియోజకవర్గం వెలుగులోకి వచ్చింది. ఇవ్వాళ అభివృద్ధికి చిరునామాగా గజ్వేల్‌ మారింది. మిషన్‌ భగీరథ పథకాన్ని రాష్ట్రంలోనే ముందుగా పూర్తిచేసుకున్నది. దేశ ప్రధాని మోదీ చేతుల మీదుగా కోమటిబండ వేదికగా ఇంటింటికీ నీళ్లిచ్చిన చరిత్ర కేసీఆర్‌ది. ఒక్క మంచినీళ్లే కాదు, ఇవ్వాళ కేసీఆర్‌ నాయకత్వంలో అన్నిరంగాల్లో అగ్రగామిగా గజ్వేల్‌ నిలిచింది. 2014కు ముం దు వ్యవసాయం భారంగా మారి ఆత్మహత్యలకు కేం ద్రంగా ఉండేది. కానీ ఇవ్వాళ సమృద్ధిగా పంటలు పం డే అన్నపూర్ణగా మారింది. ఒక పక్క కొండపోచమ్మసాగర్‌, మరోపక్క మల్లన్నసాగర్‌ పూర్తిచేసి సాగునీటికి కొదువ లేకుండా చేసింది కేసీఆరే. ఒకనాడు 400 కేవీ సబ్‌స్టేషన్‌ ఉన్నా నాణ్యమైన కరంటుకు నోచుకోని ప్రాంతం ఇవాళ 24 గంటల నాణ్యమైన విద్యుత్తుతో కాంతులీనుతున్నది. ఏ గ్రామానికి వెళ్లినా మంచి కనెక్టింగ్‌ డబుల్‌ రోడ్లు, అందమైన చెట్లు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, నల్లా నీరు కనిపిస్తున్నాయి. గజ్వేల్‌కు రైలు రావాలనేది దశాబ్దాల కల. యాభై ఏండ్ల నుంచి ముందుకుసాగని రైల్వే లైనును ఐదేండ్ల లో పూర్తిచేసి ట్రయల్‌ రన్‌ చేసిన ఘనత కేసీఆర్‌ది.

అభివృద్ధి చెందడానికి భౌగోళికంగా, వ్యాపారపరంగా, వనరులపరంగా ఎన్నో అవకాశాలున్న ప్రాం తం గజ్వేల్‌ నియోజకవర్గం. కానీ అభివృద్ధిని తొక్కిపెట్టి జనాన్ని బాగుపడకుండా చేసిన ఘనత ఉమ్మడి రాష్ట్ర పాలకులది. పరాయి పాలకులకు ఊడిగం చేయ డం తప్ప ఆత్మగౌరవం అంటే ఏమిటో కాంగ్రెస్‌ పాలకులకు తెలువదు. ఆత్మగౌరవం అంటే తెలంగాణ ప్రజలనే అధిష్టానంగా భావించడం. ఇక్కడి ప్రజాభీష్టం మేరకు పాలించేవారే, ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని సంరక్షించగలరు. కానీ, ఢిల్లీ గులాంలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించలేరనేది సత్యం. నేడు తెలంగాణ దేశంలోనే తలెత్తుకొని ఉన్నది. దూరదృష్టి కలిగిన నాయకుడు కేసీఆర్‌ సారథ్యంలోనే తెలంగాణ సగర్వంగా ముందుకుపోతుందనటంలో ఎలాంటి సం దేహం లేదు.

మాదాసు శ్రీనివాస్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement