దళితబంధు దండోరా మోగింది చూడరా
ఆర్థిక అసమానతలు ఉండవింక సోదరా ॥దళిత బంధు॥
దేశానికి దిక్సూచి దళితబంధు పథకము
దళితబిడ్డల ఆర్థిక అభివృద్ధే ధ్యేయము
డబ్భు యేండ్ల పాలనలో చేసింది ఏందిరా ॥2)
దళితులకు కేసీఆర్ పెద్దపీట వేసెరా ॥దళిత బంధు॥
తెలంగాణ గడ్డమీద పేదరికం పోవాలని
దళితులకు సామాజిక అభివృద్ధే రావాలని
కేసీఆరే దళితులకు ఆత్మబంధువాయెరా ॥2॥
దళితబంధు పథకంతో పెద్ద దిక్కు ఆయెరా ॥దళిత బంధు॥
దళితవాడల అభివృద్ధితో ఆనందం విరియాలి
దళితబంధు ప్రతి గడపలో సంతోషం నింపాలి
కేసీఆర్ నెరవేర్చెను అంబేద్కరు ఆశయం
దళితుల చైతన్యం మన కేసీఆర్ లక్ష్యమూ.. ॥దళిత బంధు॥
బాలు కాంపల్లి
99499 27504