e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home ఎడిట్‌ పేజీ శాంతి… సహజ స్వభావం

శాంతి… సహజ స్వభావం

శాంతి అంటే సంఘర్షణ లేదా హింస లేకపోవడమే కాదు. ప్రపంచశాంతి గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక మౌలికమైన సత్యాన్ని మరిచిపోతున్నాం. వ్యక్తిగతంగా తమతో తాము ప్రశాంతంగా ఉండకపోతే ప్రపంచ శాంతి లేదా బాహ్యమైన శాంతి సాధ్యం కాదు.

అంతరంగంలో ప్రశాంతత: మౌనంగా ఉండే మనసు, చురుకుగా ఉన్న బుద్ధి, తేలికగా మంచితనంతో కూడిన భావనలు, ఆరోగ్యవంతమైన శరీరం, సేవ చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే హృదయం, మన ప్రవర్తనలో కరుణ- వీటిని అంతరంగ ప్రశాంతత సూచిస్తుంది.

- Advertisement -

నీతివంతంగా ఉండాల్సిన అవసరం: ప్రపంచాన్ని ప్రశాంతంగా తీర్చిదిద్దాలనుకుంటే మొద ట నైతిక విలువలను చక్కదిద్దాలి. సమాజానికి నైతిక విలువలు మూలస్తంభాలు. నైతిక విలువలంటే ఏమిటి? ఇతరులు చేసే ఏ పని నీకు కష్టం కలిగిస్తుందో ఆ పనిని నీవు ఇతరులకు చేయకుండా ఉండటం. నువ్వు అనుసరించే విధానాన్ని ఇతరులు అడ్డుకోకూడదని నీవు భావిస్తే, ఇతరుల విధానాలను నువ్వు అడ్డుకోవద్దు. నీకెవరూ కష్టం కలిగించకూడదని, హాని చేయకూడదనుకుంటే నువ్వు ఇతరులను కష్టపెట్టడం, హాని చేయడం మానేయాలి. మన అస్తిత్వాన్ని రక్షించుకుంటూనే ఇతరులను గౌరవించాలి.

అంతరంగ ప్రశాంతత నుంచి బాహ్యంలో ప్రశాంతత వైపు: ప్రపంచ శాంతికి అంతరంగ శాంతి మూలం. తమలోనే ఉన్న ప్రశాంతమైన ప్రదేశానికి ప్రజలు చేరుకోగలిగితే అప్పుడు బాహ్య ప్రపంచంలో శాంతి సాకారం అవుతుంది. ఈ ప్రపంచపు అసలైన స్వభావాన్ని గురించిన జ్ఞానం అంతరంగ ప్రశాంతతను చేరటానికి మనకు సహాయపడుతుంది. ఆ జ్ఞానం ఏమిటి? ప్రతిదీ మారిపోతుంది, ప్రతిదీ మారిపోతూనే ఉంది అని తెలుసుకోవడం. ఈ ఎరుక – ఏదో ఒకరోజున ఇదంతా అంతరించిపోతుందనే ఎరుక, మన మనసును ఆందోళన చెందే అలవాటు నుంచి బయటకు తీసుకువస్తుంది. గతంలో అనేక విషయాలు జరిగాయి. కొన్ని ఆనందాన్నిచ్చాయి, కొన్ని దుఃఖాన్ని మిగిల్చాయి. అయితే అవన్నీ వెళ్లిపోయాయి. ప్రతి ఒక్కటీ మారిపోతున్నది, ప్రతి విషయమూ అంతరించిపోతున్నదని గ్రహించినప్పుడు మీరు బలంగా ఉంటారు. అదే సమయంలో సున్నితంగా, స్థిరంగా కూడా ఉంటారు.

చైతన్యానికి వైవిధ్యం అంటే ఎంతో ప్రేమ: ఈ భూమ్మీద ఒకే రకం పండ్లు, ఒకే రకమైన మనుషులు లేదా జంతువులు లేవు. కాబట్టి చైతన్యానికి ఒక యూనిఫామ్‌ (ఏకరూప దుస్తులు) వేయకండి. ఈ విశ్వంలోని వైవిధ్యాలన్నింటినీ ఆరాధించి, గౌరవించి, ప్రేమించడం ద్వారా వాటిని మనం ఆనందిద్దాం. ‘పరమత సహనం’ అనే మాటను మనం తరచుగా వింటుంటాం. ఆ మాట ఇప్పుడు పాతబడిపోయిందని నా ఉద్దేశం. పరమతాన్ని సహించడమనేది మీరు దాన్ని ప్రేమించలేనప్పుడు అవసరం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క మతాన్నీ సొంత మతమని భావించి ప్రేమించాలి. మతానికి ఉన్న గొప్పదనం ఆ మతం నాది కావడం వల్ల రాలేదు. ఏ మతానికైనా గొప్పతనం అది మతం కావడం వల్లనే వచ్చింది. ఆధ్యాత్మిక, మత విషయాల జ్ఞానాన్ని పంచేవారికి, ప్రజలను ఆ మార్గంలో నడిపించే వారందరికీ ఈ విషయం సరిగ్గా అర్థమైనప్పుడు మన సుందరమైన ప్రపంచంలో మత అసహనం అనేది అంతరించిపోతుంది. జీవితం పట్ల విశాల దృక్పథాన్ని అలవర్చుకునేందుకు వీలుగా ప్రజలందరికీ అన్ని మతాల గురించి, అన్ని సంస్కృతుల గురించి కొంతైనా అవగాహన కలిగేలా బోధించడం అవసరం. ఆధ్యాత్మికతకు ఆది మూలమైన ధ్యానం, విశ్వ సౌభ్రాతృత్వం అనేవి లేనప్పుడు ఏ మతమైనా డొల్లగానే మిగిలిపోతుంది.

మనం చేయవలసినదల్లా మనలో ఉన్న అనంతమైన ప్రశాంతతను, మన సహజ స్వభావాన్ని తెలుసుకోవడమే. ప్రశాంతంగా ఉన్న ప్రజలు మాత్రమే ప్రశాంతమైన అందమైన ప్రపంచాన్ని నిర్మించగలుగుతారు. అటువంటి ప్రపంచంలో వైవిధ్యం, దయ, సేవాభావనలు గౌరవాన్ని పొందుతాయి

ఈ భూమ్మీద ఒకే రకం పండ్లు, ఒకే రకమైన మనుషులు లేదా జంతువులు లేవు. కాబట్టి చైతన్యానికి ఒక యూనిఫామ్‌ (ఏకరూప దుస్తులు) వేయకండి. ఈ విశ్వంలోని వైవిధ్యాలన్నింటినీ ఆరాధించి, గౌరవించి, ప్రేమించడం ద్వారా వాటిని మనం ఆనందిద్దాం.

గురుదేవ్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement