కుక్కపిల్ల,
అగ్గిపుల్ల,
సబ్బుబిళ్ల…
హీనంగా చూడకుదేన్ని
జీఎస్టీ మయమేనోయ్ అన్ని
రొట్టెముక్క,
అరటితొక్క,
బల్లచెక్క…
ఆయన వైపే చూస్తూ ఉంటాయ్
తమలో జీఎస్టీ కనుక్కోమంటాయ్
తలుపు గొళ్లెం
హారతి పళ్లెం
గుర్రపు కళ్లెం…
కాదేది జీఎస్టీ కనర్హం
ఔనౌను శిల్ప మనర్ఘం
ఉండాలోయ్
టాక్సావేశం
ఉంది కదా కౌన్సిల్ నిర్దేశం
దొరకదటోయ్ కారణలేశం
కళ్లంటూ ఉంటే చూసెయ్,
వాటంగా పన్నులు వేసెయ్
ప్రపంచ మొక పద్మవ్యూహం
జీఎస్టీ ఒక తీరని దాహం…