ఓటే నీ పరమాత్మయు
ఓటే నీ ఊరువాడ ఉన్నతికెపుడున్
ఓటును చేటుగ తలపక
ఓటును వేయగ కదలుడు ఓటరులారా.
ప్రజలకు చేరువ నిలబడి
ప్రజాసమస్యలనుదీర్చు పాలనయనగన్
రుజువునుజేయుచు ఓట్లను
నిజాయితిగ గెలుచుకొనుడు నేతల్లారా.
నమ్ముకున్నజనుల నట్టేటముంచుచున్
పగలసెగలురగుల తగవులాడి
తాగిఊగుచు పెడదారినబడి నడ
యాడువారి ఓటు కీడుదెచ్చు.
ఎన్నోకలలనుకనుచున్
ఎన్నికలొచ్చినిలిచె మన ఎదుటనునేడున్
ఉన్నతమౌ ఓటునుగని
ఎన్నుకొనవలె మహనీయ ఏలికనెవరో.
నోట్లను చూపించి అధిక
సీట్లను కాజేయు నక్కజిత్తులవారిన్
ఓట్లవిలువతో సమ్మెట
పోట్లకు గురిజేయగవలె బుధజనులింకన్.
– రాకుమార 95501 84758