రైతుల రక్తాన్ని పీల్చే
రాబంధుల రోజులు పోవాలని..
కర్షకుల కష్టాన్ని కరెన్సీ చేసుకునే భూస్వాముల
భాగస్వామ్యం ఉండొద్దని..
ఆరునెలల పంట మొత్తం అమ్మినా
తీరని అసలు, వడ్డీ వంటి
పరిస్థితి రాకూడదని..
అవనిని నమ్మి హలం
చేతబట్టి అహర్నిశలు కష్టపడ్డా
కానరాని కాసుల కాలం
కాలగర్భంలో కలవాలని…
పదిమందికి అన్నమందించే రైతు
ఆత్మహత్యలకు ఆవల ఉండాలని..
పంట పండించే రైతు పది కాలాలు
పదిలంగా ఉండాలని..
రైతుకు ధీమా రైతుబీమా అని..
స్వరాష్ట్రంలో రైతే రాజు అంటూ..
రైతుబంధు ఇస్తూ అయ్యారు ఆపద్బంధు..
-హరినాథ్రాజు , చెన్నమాధవుని