వెలవని రంగులలో
ఏ నోట తానే మాటగా
అందరి చేతుల్లో తిరుగుతూ
అందమైన నోటుగా మెలుగుతూ!
డాలర్ తన ముందు
కాలర్ ఎగురవేస్తుందని
వల వల విలపిస్తుంది
తన విలువ తగ్గిందని!
తన పై ముద్రించిన గాంధీ
తనను చూసి మౌనంగా
నవ్వుతుంటే సిగ్గేస్తుందని
జేబుల ముడుతల్లో దాక్కుంటుంది!
తననిండా గీతలే
అవన్నీ తన తల రాతలే
మార్కెట్లో తానుంటే దరలన్నీ పైపైకి
తన విలువ నేల వైపుకి!!
చలామణిలో ఉన్నంత సేపే
లేకుంటే చెల్లని మనీనే!!
-జగ్గయ్య. జి , 9849525802