అతను మౌనంగా ఉంటే
ఒక తెలియని భయం వెంటాడుతది!
అతను
నోరు విప్పితే
దిక్కుమాలిన స్వరాలన్నీ
మూగబోతాయి!
అతని
కదలికలు కంటికానకపోతే
వెన్నులో చలి జొరబడుతుంది!
అతనో మహా వ్యూహకర్త
యుద్ధం మొదలవక ముందే
ఆయుధాలు సరి చూసుకుంటున్నాడు!
ఎదిరి బలాన్ని బలగాన్ని
అంచనా వేస్తున్నాడు
కలిసొచ్చే వారికి కౌగిలిస్తున్నాడు!
ఇప్పుడు శిశుపాలురు
ఒకరిద్దరు కాదు
బోలెడు విష్ణు చక్రాలు కావాలి!
గెలుపు అనివార్యమైప్పుడు
అతని వ్యూహాలు
వైరి పక్షాలకు అంతు చిక్కవు!
జనం సాక్షిగా
కాలాన్ని వెంట తిప్పిన వాడు
గెలిచి తీరుతాడు!
వైరి వీరులారా !
జల స్తంభన విద్య నేర్చుకోండి
ఓడితే దాక్కోవడానికి కాళేశ్వరం సిద్ధం!!
-కోట్లవెంకటేశ్వర రెడ్డి 94402 33261