డాలర్ డ్రీమ్స్‌కు ఏఐ దెబ్బ
విదేశాల్లో కొలువులు చేయాలనుకునే యువత కల కల్లగానే మిలిగిపోతున్నది. డాలర్ డ్రీమ్స్‌పై అమెరికా కంపెనీలు నీళ్లు చల్లుతున్నాయి. ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తుండటమే దీనికి కారణం. అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు జాబ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
విదేశాల్లో కొలువులు చేయాలనుకునే యువత కల కల్లగానే మిలిగిపోతున్నది. డాలర్ డ్రీమ్స్‌పై అమెరికా కంపెనీలు నీళ్లు చల్లుతున్నాయి. ప్రముఖ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తుండటమే దీనికి కారణం. అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు జాబ్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా చిన్నచిన్న స్టార్టప్‌ల నుంచి ఐటీ దిగ్గజాల వరకు అన్ని కంపెనీలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. కొత్త కొలువుల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగం ఊడకపోతే చాలు అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
కొవిడ్ తర్వాత అన్ని సంస్థలు డిజిటలైజేషన్ వైపు మొగ్గుచూపాయి. ఈ-కామర్స్‌లో కొనుగోళ్లు పెరిగాయి. లాక్డౌన్ కారణంగా సామాజిక మాధ్యమాలను వాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆన్లైన్లో పాఠ్యాంశాలు బోధించే ఎడ్యుటెక్ సంస్థలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సాంకేతిక నిపుణులకూ డిమాండ్ పెరిగింది. అందువల్లే మెటా, గూగుల్, అమెజాన్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ లాంటి వాటితో పాటు దేశీయంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలకు, స్టార్టప్‌లకు ప్రాజెక్టులు ఎక్కువగా వచ్చాయి. అవి అవసరానికి తగ్గట్టుగా ఉద్యోగులను నియమించుకున్నాయి. అయితే ఆ తర్వాత మారిన పరిస్థితులు, ఏఐ రంగప్రవేశం తదితర కారణాల వల్ల టెక్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 2023లో ఈ ప్రభావం ఆయా సంస్థలపై తీవ్రంగా పడింది. దీంతో కంపెనీలు వరుసగా లేఆఫ్‌లు ప్రకటిస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ ప్రభావంతో ఐటీ రంగం నేల చూపులు చూస్తున్నది. ప్రాజెక్టులు లేకపోవడంతో టెక్ కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు మొగ్గుచూపుతున్నాయి. అందులోభాగంగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. 2023లో 78,840 మందిని రిటైల్ కంపెనీలు తొలగించినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తున్నది. తొలగింపు విషయాన్ని ఈ-మెయిల్, వీడియోకాల్ ద్వారా కంపెనీలు తెలియజేస్తుండటం గమనార్హం.
2022లో అమెరికాలోని అన్ని కంపెనీలు 3,63,832 మంది ఉద్యోగులపై వేటు వేశాయి. 2023లో ఈ సంఖ్య 7,21,677కు పెరిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితే ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణమని పలు నివేదికల్లో తేలింది.ఆర్థిక పరిస్థితులు, వ్యయాలను బేరీజు వేసుకొని నియామకాలపై కసరత్తు చేస్తున్నట్టు పలు సంస్థలు తెలుపుతున్నాయి. దీంతో భారతీయుల డాలర్ డ్రీమ్స్‌కు బ్రేకులు పడ్డాయి. రానున్న రోజుల్లోనూ ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం కనిపించకపోవడం ఆందోళనకరం.
– ఇస్కా రాజేష్‌బాబు, 93973 99298
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

