తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాహిత్య అకాడమీ, సమ్మక్క సారక్క డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం మొదటి అంతస్తులో డాక్టర్ కొరుప్రోలు హరనాథ్ కవితా సంపుటి ‘నా అడుగులటువైపే’ ఆవిష్కరణ జరుగుతుంది. అదేవిధంగా సమ్మక్క సారక్క డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరెక్టర్ సబితారెడ్డికి అంకితోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు ఆవిష్కర్తగా డాక్టర్ సుద్దాల అశోక్ తేజ (ప్రముఖ కవి, సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత) వ్యవహరిస్తారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా డాక్టర్ కాంచనపల్లి వ్యవహరిస్తారు. వక్తగా ప్రముఖ కవయిత్రి ధూళిపాళ అరుణ, విశిష్ట అతిథులుగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి (డైరెక్టర్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ), డాక్టర్ దేవులపల్లి వాణీదేవి (ప్రముఖ కవయిత్రి), డాక్టర్ బాలాచార్య నామోజు (సెక్రటరీ, తెలంగాణ సాహిత్య అకాడమీ), డాక్టర్ కె.అనితారెడ్డి (కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు) గుడిపాటి (సంపాదకుడు, పాలపిట్ట) వ్యవహరిస్తారు. అనంతరం పరాభవ నామ సంవత్సరం ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా పర్యావరణ, ప్రకృతి, వసంతం, దాంపత్యం అనే అంశాలపై దాదాపు 30 మంది కవులు, కవయిత్రులతో కవి సమ్మేళనం జరుగుతుంది.
ఏవీ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి) తెలుగు శాఖ నేతృత్వంలో ముచ్చింతల సుదర్శన్‌రెడ్డి రచించిన ‘మమతానురాగాలు’ (పద్య కవితా సంపుటి) పుస్తకావిష్కరణ సభ మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాల ఆడిటోరియంలో జరుగుతుంది. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సభలో నండూరి రామచంద్రరావు, ఆచార్య కె.రామచంద్రారెడ్డి, డా.కె.గౌతమి, డా.ఎం.భగవంతరెడ్డి, డా.పి.పద్మ, డా.వై.సత్యనారాయణ, డా.బి. జ్యోతి, టి.వంశీకృష్ణ తదితరులు పాల్గొంటారు.