మహిళలను మూఢనమ్మకాలు, ఆచారాల పేరిట అణచివేత, సతీ సహగమనం లాంటి ఆచారాలను తిప్పి కొట్టడానికి చరిత్రలో అనేక మంది కృషి చేసినట్టు మనం చదువుకున్నాం.. ఆడవారికి చదువు అక్కర్లేదంటూ… ఇంటికే పరిమితం చేసిన ఆచారాలపై.. తిరుగుబాటు చేసి, సృష్టికి మూలం స్త్రీలు, ఈ భూమి మీద పురుషులతో సమానమైన హక్కులుండాలని సాధించుకున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే మహిళల అభ్యున్నతి కోసం చేసిన కృషి ఫలితంగా నేడు ఎన్నో హక్కులు లభించాయి. ఆ మహనీయుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ .. మహిళల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాలు చాలా శక్తివంతమైనవి. ఉమ్మడి రాష్ట్రంలో మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి. అటువంటి పరిస్థితులను ఉద్యమ రథసారథి కేసీఆర్ పూర్తిగా మార్చి వేశారు. తెలంగాణలో మహిళలు స్వేచ్ఛగా ఉండేందుకు ఆయన తీసుకొచ్చిన అనేక చర్యల వల్ల నేడు వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ పేరుతో రక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. మహిళలపై ఎటువంటి దాడు లు, వేధింపులు జరగకుండా షీ టీమ్లతో భద్రతకు చర్యలు చేపట్టారు. తెలంగాణలో ఆడబిడ్డ అంటేనే భారంగా భావించే తల్లిదండ్రులకు భారాన్ని తగ్గించారు.ఆడబిడ్డ కన్నీరు పెట్టొద్దని… వారికోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో ఆర్థిక సా యం అందజేసి అండగా నిలుస్తున్నారు. అత్తగారింటికి వెళ్ల్లే ఆడబిడ్డను ఆత్మగౌరవంతో సాగనంపుతున్నారు. దీని ద్వారా వరకట్న బాధలను తగ్గించి.. వరకట్న చావులు లేకుండా కృషి చేశారు. ఆడ బిడ్డల ఆరోగ్యం కోసం అంగన్ వాడీల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తల్లిగా బిడ్డకు జన్మనివ్వబోయే వారికి అంగన్ వాడీల ద్వారా పోషకాహారం అందించి.. తల్లీ బిడ్డల సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు కేసీఆర్ కిట్ అందిస్తున్నారు.
తెలంగాణలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించి నేడు మహిళాలోకాన్ని పాలనలో భాగస్వాములను చేయడం గొప్ప విశేషం. ఒకనాడు వంటింటికే పరిమితమైన వారు నేడు గ్రామ పంచాయతీ వార్డు మెంబరు నుంచి.. రాష్ట్రస్థాయి పదవుల వరకు మహిళలు రాజకీయ రంగాల్లో రాణించేలా తెచ్చిన సంస్కరణలతో తెలంగాణ పరిపాలనలో భాగస్వాములుగా చేశారు. ఇప్పటి వరకు ప్రత్యేకంగా మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వాలు లేవు. అటువంటిది కేసీఆర్ మహిళలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించారు. గతంలో మార్కెట్ కమిటీలో ఎటువంటి అవకాశం లేని మహిళలకు నేడు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల మహిళలు నేడు అనేక మంది చైర్పర్సన్లుగా ముందుకు వస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు గా రాణిస్తున్నారు. పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేయాలనే ఆలోచన చాలా గొప్పది. మహిళ చైతన్యానికి రాజకీయ అవకాశాలు చాలా ఉపయోగపడతాయి.
తెలంగాణలో ఆడబిడ్డల ఆత్మగౌరవపు పండుగ బతుకమ్మ. అలాగే తెలంగాణ ఉద్యమంలోనూ బతుకమ్మ ఆటలు స్ఫూర్తిని నింపాయి. అటువంటి బతుకమ్మ పండుగను ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నది. పం డుగ సందర్భంగా ఆడబిడ్డలను గౌరవిస్తూ ప్రభుత్వం బతుకమ్మ చీరెలను పంపిణీ చేసి గౌరవిస్తున్నది. అలాగే రంజా న్, క్రిస్మస్ సందర్భంగా మైనారిటీ మతాలకు చెందిన మహిళలకు చీరెలు కానుకగా అందజేస్తున్నది. అంగన్వాడీలకు పోచంపల్లి చీరలను పంపిణీ చేయడం ద్వారా నేత కార్మికులందరికీ పని దొరికింది.
గృహ హింసకు గురవుతున్న మహిళలకు న్యాయ సహాయం, వైద్య సహాయాన్ని అందించేందుకు మహిళా పోలీసుల ఆధ్వర్యం లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని శిక్షించేందుకు ప్రభుత్వం పోక్సో కోర్టులను ఏర్పాటు చేసింది. బాలల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 33 జిల్లాల్లో ప్రత్యేక బాలరక్షక వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నారు. అలాగే ఒంటరి మహిళలకు పింఛన్ అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇదే కాకుండా వ్యాపార రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రో త్సాహకాలు అందజేస్తున్నారు. సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి కార్యాచరణ చేపడుతున్నారు మన ఉద్యమ రథసారధి కేసీఆర్..
స్త్రీశక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యం గా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్న ది. కేసీఆర్ కిట్. ఆరోగ్యలక్ష్మి ,కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల ద్వారా మహిళలు లబ్ధిపొందుతున్నారు. ప్రత్యేక మహిళా పారిశ్రామిక పార్కుల నిర్వహణ ద్వారా మహిళకు ఉద్యోగ, ఉపాధి కల్పన, మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక ఎస్టేట్లో 10 శాతం ప్లాట్లు రిజర్వు చేశారు. స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అలాగే సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, ఏఆర్ పోలీసు నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇదం తా కేవలం పదేండ్లలోపే జరుగడం విశేషం. ఆడబిడ్డ అంటేనే… భా రంగా భావించే సమాజానికి.. ఆడ బిడ్డలకు, మహిళలకు సీఎం కేసీఆర్ తెచ్చిన సంస్కరణలు, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ధైర్యానిస్తున్నాయి. మహిళ సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నది.