ప్రజలను మూసీలో ముంచారు
పొద్దున లేస్తే నాటి నిజాం రాజులను విమర్శించడం ఇప్పుడొక ఆచారం. దాని సంగతి సరే, నేటి కాంగ్రెస్ పాలకులు సాగిస్తున్న అనాచారాల మాటేమిటనేది అసలు ప్రశ్న. వందేండ్ల క్రితం వరదలతో మూసీ ప్రళయ తాండవం చేస్తే ప్రజలు ఘోరకలి చూశారు. వడవడ వణికిపోయారు.
పొద్దున లేస్తే నాటి నిజాం రాజులను విమర్శించడం ఇప్పుడొక ఆచారం. దాని సంగతి సరే, నేటి కాంగ్రెస్ పాలకులు సాగిస్తున్న అనాచారాల మాటేమిటనేది అసలు ప్రశ్న. వందేండ్ల క్రితం వరదలతో మూసీ ప్రళయ తాండవం చేస్తే ప్రజలు ఘోరకలి చూశారు. వడవడ వణికిపోయారు. అది చూసి అప్పటి రాజు గుండె కరిగి కన్నీరుమున్నీరయ్యారు. నదీమతల్లీ శాంతించు అంటూ హారతులిచ్చి జోతలు పట్టారు. బోనాలెత్తించి అమ్మలను వేడుకున్నారు.
ఇక వరదల సమస్య శాశ్వత పరిష్కారానికి తర్వాతి కాలంలో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి విశ్వవిఖ్యాత ఇంజినీర్లను రప్పించారు. ఎగువన జలాశయాలు కట్టి అడ్డువేసి ప్రజలను ఆదుకున్నారు. గండిపేట చెరువును ఉస్మాన్సాగర్గా విస్తరించి, హిమాయత్ సాగర్ తవ్వి ప్రజల దాహార్తినీ తీర్చారు. మూసీని ఆసరాగా చేసుకుని నగరాన్ని విస్తరించి దాని తీరాన సుందర సౌధాలను గోపురాలతో సహా తీర్చిదిద్దారు. రాతి పందిళ్లు నిర్మించి నగర పౌరులకు ప్రశాంత నదీవీక్షణ సౌకర్యాన్ని కల్పించారు.
కాలక్రమంలో రాజులు పోయి కాంగ్రెస్ తరాజులు వచ్చారు. నాటి పాలకులు కట్టించిన అవే జలాశయాలను ఆసరాగా చేసుకొని ఇప్పుడు ప్రజలను నిలువునా ముంచి తమాషా చూస్తున్నారు. నాటి పాలకుల లక్ష్యం వరదలు నివారించి ప్రజలను కాపాడటమైతే నేటి పాలకులకు వరదలు సృష్టించి నగరాన్ని తరిమికొట్టడమే ఇష్టం. పొద్దున లేస్తే మూసీ అభివృద్ధి, సుందరీకరణ అంటూ వల్లించి చివరకు వరదల్ని ఆయుధంగా మలచుకుని ప్రజలను బలిపెడుతున్నారు. వారికి కావాల్సింది మూసీ అభివృద్ధి కానే కాదు. దాని వెనుకనున్న లక్ష్యం లక్షన్నర కోట్ల ప్రాజెక్టు, అందులో దొరికే కమీషన్ల కోసం కక్కుర్తి.
పేదోళ్లను తరిమికొట్టి పెద్దోళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టాలనే ఆత్రుత. నాటి పాలకులు మూసీలో పైసలు పోసి ప్రజలకు ప్రాణ రక్షణ కల్పిస్తే నేటి కాంగ్రెస్ పాలకులు ఆ మూసీలోనే కాసులవేట సాగిస్తున్నారు. పాత నగరాన్ని కాపాడలేనోళ్లు కొత్తగా ఫ్యూచర్ సిటీ కడతామని ఎగిరెగిరి పడుతున్నారు. ఇక్కడ ప్రజలు మూసీ నది మురికిలో సతమతమవుతుంటే అక్కడెక్కడో శిలాఫలకాలు వేయడానికి ఉరుకులాడుతున్నారు.
ఈ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచీ ప్రజలపై, ముఖ్యంగా పేదలపై పగబట్టింది, కక్షగట్టింది. హైడ్రా పేరిట మూసీ తీరవాసులకు నిత్యనరకం చూపిస్తున్నది. పండుగ లేదు, పబ్బం లేదు, పగలు లేదు, రాత్రి లేదు.. బుల్డోజర్లను తోలుతూ భయోత్పాతం సృష్టిస్తున్నది. పైసాపైసా కూడబెట్టి గూడుకట్టుకున్న బక్కపేదోళ్లకు నిద్రలేకుండా చేస్తున్నది. పిల్లాపాపలతో సంసారాలు వీధిపాలైతే, పిల్లల బడిపుస్తకాలు బురదపాలైతే వినోదం చూస్తున్నది, వికటాట్టహాసాలు చేస్తున్నది. కోర్టు సెలవునూ కోవర్టుగా వాడుకునే వికృతచేష్టలకు పాల్పడుతున్నది. కోర్టులు మొట్టికాయలు వేసినా, తలంటు పోసినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా బరితెగిస్తున్నది. ఇప్పుడు మూసీ నది ముంపు ఆ కంపు ధోరణికి కొనసాగింపు మాత్రమే!
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
Road accident | కరీనంగర్ జిల్లాలో విషాదం.. కారు ఢీ కొని యువకుడి మృతి
Health tips | లేవగానే బ్రష్ చేయకుండానే నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

