మనిషితనమంటే మంచితనమని
మనిషితత్వమంటే మానవత్వమని
మాధవుడంటే మనిషి రూపంలో దేవుడని
మంచి మనసులకు అర్థమైపోతుంది
ఆ మంచితనమే
ఇప్పుడు కాలాన్ని ఏలుతోంది
అధినాయకుడి కనుసన్నల్లో రాష్ట్రం సుభిక్షంగా వెలుగుతోంది
ఆ చేయి చితికిన బతుకులకు
భరోసానిచ్చే ఆపన్న హస్తం
ఆ మాట వేల దిగుళ్లను రూపుమాపే ధైర్యవాక్కు
ఆ చూపు చీకటి నిండిన బతుకుల్లో ఓ ఆశాకిరణం
ఆ నడక ముళ్ల దారుల్ని పూలబాటగా మార్చే వెలుగుదివ్వె
మనిషంటే సమూహమని
నిలువెత్తు ప్రేమకు స్వరూపమనీ
అర్థం చేసుకునే మనసులకే తెలుస్తుంది
తన వంతుగా వెలుగులు పంచే మనసున్న మారాజు
మానవత్వపు పరిమళాల్ని ప్రేమతో వెద జల్లుతూ
చరిత్ర పేజీలను తిరగరాసే దయా హృదయుడు
సమూహానికి ఆపద్బాంధవుడు
ధనసంపద కన్నా గుణసంపదే మేలని
సాటివాని కష్టానికి స్పందించే హృదయమే గొప్పదని
నమ్మి నడిపించే సిసలైన అధి నాయకుడు
ఎన్. లహరి: 98855 35506