స్నేహితానికి, సాహిత్యానికి విబేధాలుంటాయా.. పోనీ ఏదైనా అంశం మీద ఈ రెంటికీ మధ్య వైరం వస్తుందా… అలా మాటా మాటా వస్తే వారిద్దరి మధ్య రాజుకుంటుందా.. అసలు మన ఇద్దరం మన దారులు వేర్వేరు అని విడివిడిగా విడిపోతారా.. సాహిత్యమే తప్ప మనం ఎప్పటికీ స్నేహితులమే మనిద్దరి సిద్ధాంతాలు వేర్వేరు కావచ్చు కానీ, మనం కలిసే ఉన్నామని సాహిత్య ప్రపంచానికి చెప్తారా… సైద్ధాంతికంగా శరీరాలు స్నేహితంగా మాత్రం సయామీ కవలలే అంటున్న లో చాలానే ఉన్నాయి. అవి తెలి స్తే ఇప్పుడు వీస్తున్న ప్రాంతీయ గాలి అచ్చమైన వైపే మళ్లుతుంది కదా!
ఇంతకీ విషయం ఏమంటే ఆనాటి రోజుల గురించి తలపోసుకోవడం. స్నేహంలో సాహి త్యం వొదిగిపోతుందని చెప్పడం. సాహి త్య ప్రముఖులు కోవెల సంపత్కుమారాచార్య, చేరాగాప్రసిద్ధి పొందిన చేకూరి రామారావుల మధ్య సాహిత్య వైరం తెలుగు సాహిత్య లోకానికి… ముఖ్యంగా నేటి సాహిత్య సమాజానికి తెలియాలనే ఈ నాలుగు మాటలు.
కోవెల సంపత్కుమారాచార్య, చేరాగా పిలవబడే చేకూరి రామారావు ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరూ మంచి సాహిత్యవేత్తలు. ఇద్దరికీ వారి వారి ఇష్టాలు, అభిరుచులు, ప్రేమలు, వ్యతిరేకతలున్నాయి. ముఖ్యంగా కవిత్వం విషయంలో అయితే మరీ ఎక్కువగానే ఉన్నాయి. దీనికి ముందు ఓ చిన్న విషయం చెప్పాలి. హైదరాబాద్ ద్వారకా హోటల్లో జరిగే నిత్య సమావేశాల్లో ఓ రోజు నేనూ ఉన్నాను. అక్కడికి చేరా వచ్చారు. చాలా హడావుడిగా వచ్చి శివారెడ్డి నుంచి ఓ పుస్తకం తీసుకుని వెళ్లిపోవడానికి లేచారు.
శివారెడ్డి కాఫీ తాగి వెళ్లండి. అంత హడావుడి ఎందుకు అని చేరా సంతోష్‌నగర్ వెళ్లాలి. కాఫీ తాగుతా అన్నారు. అక్కడున్న నేను నా బండి మీద దింపుతానని చేరాని ఎక్కించుకొని బయలుదేరాను. మధ్యలో సంతోష్‌నగర్ ఎక్కడికి సార్ అని అడిగితే చేరా సంపత్కుమారాచార్య ఇంటికి. చూసి వారం రోజులైంది. త్వరగా పోనీ అన్నారు. నేను ఇద్దరికి పడదు కదా.. ఆయనింటికేంటి అని అమాయకంగా అడిగితే రోజు చేరా నవ్విన నవ్వు నా జన్మలో ఇంక్కెవ్వరి దగ్గరా కోనసీమలో కూడా.
ఇంతకీ విషయం ఏమిటంటే.. చేరాకు, సంపత్కుమారాచార్యకుఎ మధ్య నడిచిన కవిత్వం కవిత్వానికి చందస్సు వాదన సంపత్కుమారాచార్య గారిది… వచనంలో కూడా మంచి, చిక్కని కవిత్వం చెప్పవచ్చునన్నది చేరా వాదన. ఈ విషయంపై వీరిద్దరూ వైతిక సాహిత్య పేజీలో దాదాపు వారాలు వాదులాడుకున్నారు. ఆ వాదులాట చదివిన వారెవరికైనా ఇక వీరిద్దరూ జన్మలో భావిస్తారు.
చిత్రం ఏమిటంటే ఆ చర్చ ముగిసిన తర్వాత ఆ ఇద్దరు కలిసి ఆ కలిపి పద్యం- లక్షణ చర్చ’ పేరుతో పుస్తకం వేశారు. ఇదీ సాహితీ స్నేహం అంటే. మరో విషయం చేరా రాసిన చేరా మీద సంపత్కుమారాచార్య అద్భుత సమీక్ష రాస్తే, సంపత్కుమారాచార్య రాసిన మీద చేరాతల్లో చేకూరి రామారావు ఆకాశానికెత్తారు. తెలుగులో ఇంతకంటే గొప్ప కావ్యం మరొకటి లేదంటూ చేకూరి రామారావు విశేషణాలతో రాశారు.
సిద్ధాంతాలు వేరైనా, అభిప్రాయాలు కలవకపోయినా స్నేహించిన వారు తెలుగు సాహిత్యంలో చాలామందే ఉన్నారు. తెలియాలంతే. తెలుసుకోవాలంతే. మరో కోవెల వారు… అదే సుప్రసన్నాచార్య, విప్లవకవి వరవరరావుల మధ్య సైద్ధాంతికంగా చాలా కానీ, వారి మధ్య స్నేహం మాత్రం అలా చిగురిస్తూనే ఉన్నది.
సుప్రసన్నాచార్య డాక్టరేట్ కోసం రాసిన సిద్ధాంత గ్రంథం నాలుగు కాపీలు కావాల్సి వచ్చిందట. ఆ రోజుల్లో జిరాక్స్ మిషన్లు ఆ నాలుగు కాపీల్లో ఒక కాపీ వరవరరావు తానే స్వయంగా రాశారట. ఇదీ అంటే. వీళ్లంతా తెలంగాణ వారే అంటారేమో కొందరు బుద్ధి జీవులు. విజయవాడలో వీరంతా కలిసిన సందర్భాలు వస్తే ఉషశ్రీ మేడ మీద కూర్చుని అమావాస్య చీకటిని కూడా వెన్నెలలా వారట. స్నేహాలు ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే భలే కదా!