సూర్యాపేట బిడ్డగా నా విజ్ఞప్తి
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇవ్వాలని నేను ఓటర్లకు సూచిస్తున్నాను. సూర్యాపేటలో జన్మించిన నేను కాలిఫోర్నియాకు కమిషనర్ అయిన మొదటి ప్రవాస భారతీయుడిని. కాలిఫోర్నియా కమిషనర్ హోదాలో నేను వ్యక్తిగతంగా చాలాసార్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశాను
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇవ్వాలని నేను ఓటర్లకు సూచిస్తున్నాను. సూర్యాపేటలో జన్మించిన నేను కాలిఫోర్నియాకు కమిషనర్ అయిన మొదటి ప్రవాస భారతీయుడిని. కాలిఫోర్నియా కమిషనర్ హోదాలో నేను వ్యక్తిగతంగా చాలాసార్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జగదీశ్‌రెడ్డిని కలిశాను. వారు ఎంత అంకితభావంతో, కర్తవ్య నిష్ఠతో, క్రియాశీలంగా పని చేస్తారో దగ్గరగా చూశాను. ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు.
విపక్షం ఇచ్చిన హామీలతో పోలిస్తే అధికారపక్షానికి అంకితభావం ఎక్కువ ఉం టుంది. ఎక్కువ వనరులుంటాయి. ఈ ఉప ఎన్నికలో తాము గెలిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత తనదని కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటువేయడం వివేకవంతమైన నిర్ణయం. దీనివల్ల రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి ఇద్దరూ కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు ఒక అవకాశం ఇచ్చి మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లకు నా విజ్ఞప్తి.
– రఘు రెడ్డి (కాలిఫోర్నియా కమిషనర్, అమెరికా)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

