మునుగోడు ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గానికి చెందిన ఓటర్ల కోసం కొన్ని పార్టీలు హైదరాబాద్లో గల్లీ, గల్లీ తిరుగుతూ గాలిస్తున్నాయి. మీ గల్లీలో ఎవరైనా మునుగోడు ఓటర్లు ఉన్నారా? అని ఆరా తీస్తున్నాయి.
బీజేపీ అయితే ఏకంగా ఈ పనిని పార్టీ కార్పొరేటర్లకు అప్పగించింది. మునుగోడు నుంచి జీవనోపాధి కోసం వచ్చినవారు ఎక్కువగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉంటున్నారు. వీరిని ఎలాగైనా పట్టుకొని పోలింగ్ రోజు నియోజకవర్గానికి రప్పించడానికి బాగానే ముట్టజెప్పుతున్నట్టు సమాచారం. దసరాకు ముందే ఈ ‘సందడి’ ప్రారంభం కావడంతో పండుగ ఖర్చంతా సదరు పార్టీనే భరించినట్టు చెప్తున్నారు.