కరువులో రాజకీయ తమాషాలు
జాతీయ పార్టీలమని జబ్బలు చరుచుకునే బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో ఏనాడూ ప్రజా సమస్యలపై పోరాడిన పాపాన పోలేదు. ఎంతసేపూ అధికారం కోసం ఆరాటపడటం, నిలుపుకోవడం లేదా లాక్కోవడం మీదే యావ. కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో ప్రజాస్వామ్య హక్కుల కోసం అంటూ అర్జెంటుగా ధర్నాలు, సభలు పెడుతున్నారు.
జాతీయ పార్టీలమని జబ్బలు చరుచుకునే బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో ఏనాడూ ప్రజా సమస్యలపై పోరాడిన పాపాన పోలేదు. ఎంతసేపూ అధికారం కోసం ఆరాటపడటం, నిలుపుకోవడం లేదా లాక్కోవడం మీదే యావ. కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో ప్రజాస్వామ్య హక్కుల కోసం అంటూ అర్జెంటుగా ధర్నాలు, సభలు పెడుతున్నారు. అయితే, ఆ రెండు పార్టీల చరిత్ర నిండా హక్కుల హననమే. ఒకటి ప్రకటిత ఎమర్జెన్సీ పార్టీ అయితే, మరొకటి అప్రకటిత ఎమర్జెన్సీ పార్టీ. తెలంగాణలో కరువు బారిన పడ్డ ప్రజలు, సాగు సంక్షోభంతో రైతులు సతమతమవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు కట్టగట్టుకుని ఢిల్లీకి వెళ్లి సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆందోళనలో పాల్గొంటారు. వెళ్లగా మిగిలిన నేతలు తమ పార్టీ సర్కార్ మీదే ఘోరమైన విమర్శలు సంధిస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో పంచాయతీ సెక్రటరీ నుంచి పైస్థాయి వరకు పైసలియ్యనిదే ఫైళ్లు కదలడం లేదని చెప్తున్నారు. కొత్త బిచ్చగాళ్లు షో చేస్తున్నరని నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు తమ అంతర్గత కుమ్ములాటలు తేల్చుకోలేక ఢిల్లీ పెద్దలను రప్పించుకున్నారు. దిశా నిర్దేశం చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ, నియంతృత్వ అంతం’ అంటూ పనిలో పనిగా పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల విషయంలో ఈ రెండు పార్టీల ప్రాధాన్యతల మాటేమిటి అనే ప్రశ్న ఈ సందర్భంగా సహజంగానే తలెత్తుతున్నది. ఇక గల్లీలో ఈ లొల్లి ఏమీ పట్టని సీఎం బృందం ఢిల్లీలో హంగామాకు తరలిపోయింది. ఢిల్లీ నేతలు ఇక్కడికి వచ్చి తలాతోకా లేని ఎజెండాతో రాజకీయ జాతరలు పెడుతున్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలకు నరకం చూపిస్తున్న సమస్యలేవీ కనిపించడం లేదు. అదీ సమస్య.
ఇక్కడ ఇల్లు కాలిపోతుంటే అక్కడెక్కడో ఏదో సాధిస్తామని పరుగులు తీయడం ఏమిటి? నీళ్లు బంద్, కరెంటు బంద్, చివరికి సాగు బంద్ పరిస్థితిని కాంగ్రెస్ అసమర్థ పాలకులు చేతులారా తెచ్చిపెట్టారు. సాగునీళ్ల వరకు ఎందుకు, తాగునీళ్లను సైతం ఇవ్వలేని దుస్థితి కల్పించారు. రైతు పంట వేస్తానంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని అడుగుతున్నరు. అన్నిరంగాలకు హాలిడే చెప్పి తాము మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతూ జాలీడే జరుపుకొంటున్నరు. ఎన్నికల్లో రైతు డిక్లరేషన్ అంటూ అరచేతిలో స్వర్గం చూపించిన హస్తం పార్టీ నేతలు నేడు రైతులకు కనీసం పరిహారం ఇవ్వకుండా ఢిల్లీకి మాత్రం కప్పం కడుతున్నరు. కేంద్ర సాయాన్ని కోరాలన్న ఇంగితం కూడా సీఎం, మంత్రులకు కొరవడటం దారుణం. వెరసి రాష్ట్రంలో పాలన పడకేసింది. ప్రజలను అన్నివైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతున్నయి. తరిపంటలు వద్దు, ఆరుతడి పంటలు వేయాలని ఉచిత సలహా ఇచ్చిన సర్కార్ చేతులెత్తేసింది. పంటలెండి పోతుంటే దిక్కుతోచక రైతులు గొల్లుమంటున్నరు. ఇటు సాగు పడావు పడుతున్న సంకేతాలతో బియ్యం ధరలు కొండెక్కాయి. ఈ సమస్యలపై కాంగ్రెస్ పలాయనవాదాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ బీజేపీ మౌనమే అనుమానాలు కలిగిస్తున్నది.
ఎల్ నినోతో ప్రజల బతుకు దుర్భరం అయిపోయిన పరిస్థితుల్లో పాలకులు చేయాల్సింది ఏమిటి? ప్రజల దగ్గరికి వెళ్లడం, సమస్యలు తెలుసుకోవడం. భరోసా ఇవ్వడం. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న ఆ రెండు పార్టీలు ఆ పని చేయడం లేదు. మరోవైపు తెచ్చిన తెలంగాణను అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి పథంలో పరుగులు పెట్టించిన పార్టీ బీఆర్ఎస్. తాను చక్కదిద్దిన రాష్ట్రం కష్టాల పాలవుతుంటే బీఆర్ఎస్ ఎలా చూస్తూ ఊరుకుంటుంది? అందుకే విపక్షంగా తన బాధ్యత సమర్థంగా నిర్వహిస్తున్నది. ప్రజలను చైతన్యపరుస్తూ, పాలకులు మొద్దునిద్ర వీడేలా పోరాడుతున్నది. తాజాగా ఆదిలాబాద్ వేదికగా రైతుగర్జన సభ నిర్వహించింది. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజలకు భరోసా గులాబీ పార్టీయేనని ఆ సభకు వచ్చిన అశేష జనవాహిని చాటిచెప్పింది. కాంగ్రెస్ నీటి కుట్రకు కేంద్ర బిందువైన మేడిగడ్డ నుంచి నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల మీదుగా కేటీఆర్ బస్సుయాత్ర చేపట్టబోతున్నారు. 29న దీక్షాదివస్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల 50 వేలమందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నది. బీఆర్ఎస్కు ప్రజాస్పందన లభిస్తున్నది. బీజేపీ, కాంగ్రెస్ దొందూదొందే అని ప్రజలకు అర్థమవుతున్నది. దీంతో ఢిల్లీ పార్టీల గుండెల్లో గుబులు పుడుతున్నది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

