మంత్రి రౌడీయిజం సిగ్గుచేటు
ఢిల్లీలోని హోటల్లో సాటి ప్రజాప్రతినిధిపై మంత్రి దామోదర రాజనర్సింహ సాగించిన బూతు పురాణం, బెదిరింపుల పర్వం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పేర్కొన్నారు.
- తోటి ఎమ్మెల్యేనే బెదిరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
- ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తేతెలంగాణ) : ఢిల్లీలోని హోటల్లో సాటి ప్రజాప్రతినిధిపై మంత్రి దామోదర రాజనర్సింహ సాగించిన బూతు పురాణం, బెదిరింపుల పర్వం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పేర్కొన్నారు. ఓ సీనియర్ మంత్రి స్థాయిలో ఉండి, ప్రజలు ఎన్నుకున్న జుకల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగడం, రూమ్‌లోకి తీసుకెళ్లి కొడుతానంటూ రౌడీయిజం ప్రదర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల నైజం, అహంకారం ఎంతటి దిగజారుడు స్థాయికి చేరాయో ఈ ఘటనతో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టమైందని పేర్కొన్నారు.
సొంత నియోజకవర్గంలో కరెంట్ లేక పంటలు ఎండిపోయి రైతులు కన్నీరుమున్నీరవుతుంటే, తాగునీరు దొరక జనం గొంతెండుతుంటే మంత్రి దామోదరకు పట్టదని, ప్రజల సమస్యలను పరిషరించాల్సిన బాధ్యతను గాలికొదిలేసి, ఢిల్లీకి వెళ్లి విలాసవంతమైన హోటళ్లలో తందనాలాడుతున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి, కమీషన్లు వచ్చే భవనాలు, కాంట్రాక్టులకే ప్రాధాన్యమిస్తూ దోచుకుంటున్నది చాలదన్నట్టు, జుకల్లోని ఇసుక రీచ్‌ల దందా కావాలంటూ సాటి ఎమ్మెల్యేపై ఒత్తిడి తేవడం, అనుచరులను పంపి మంత్రి స్వార్థ వ్యాపార దాహానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

