బైనాన్స్కు మదుపర్లు బైబై
క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను బైనాన్స్ హ్యాకింగ్ కలవరపెడుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్సేంజీ బైనాన్స్‌లో సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏకంగా 6.3 బిలియన్ డాలర్ల (ఇంచుమించుగా రూ.60,000 కోట్లు) ఆస్తులు దోపిడీకి గురయ్యాయి.
- రూ.45,000 కోట్ల క్రిప్టో పెట్టుబడులు వెనక్కి
- సైబర్ దాడితో బెంబేలెత్తిపోతున్న కస్టమర్లు
న్యూయార్క్, నవంబర్ 2: క్రిప్టోకరెన్సీ మార్కెట్‌ను బైనాన్స్ హ్యాకింగ్ కలవరపెడుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్సేంజీ బైనాన్స్‌లో సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏకంగా 6.3 బిలియన్ డాలర్ల (ఇంచుమించుగా రూ.60,000 కోట్లు) ఆస్తులు దోపిడీకి గురయ్యాయి. అనుమానం వచ్చిన తక్షణమే ట్రేడింగ్‌ను ఆపేశారు. మార్కెట్ చరిత్రలోనే మునుపెన్నడూ ఈ స్థాయిలో హ్యాకింగ్‌తో నష్టం వాటిల్లలేదు మరి.
ఈ క్రమంలో ఆదివారం మళ్లీ తెరుచుకున్న బైనాన్స్ క్రిప్టో ఎక్సేంజీ నుంచి మదుపర్లు పెద్ద ఎత్తున ఉపసంహరణలకు దిగారు. సైబర్ దాడి నేపథ్యంలో ఎక్సేంజీ ఇచ్చిన 3 రోజుల విరామం భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు తొలిగిపోయింది. అయితే ఆ వెంటనే భారీగా విత్‌డ్రాయల్స్ మొదలయ్యాయి. ఈ దెబ్బకు పాపులర్ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ 75,000 డాలర్ల దిగువకు దిగజారింది. మరిన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
వేల కోట్లలో విత్‌డ్రాయల్స్
ఒక్కరోజే ఏకంగా 4.72 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.45,000 కోట్లు) బైనాన్స్ ఎక్సేంజీకి దూరమయ్యాయి. ఈ ఎక్సేంజీలో ఉన్న ఆస్తుల విలువలో ఇది సుమారు 2.8 శాతానికి సమానం కావడం గమనార్హం. బైనాన్స్ నిర్వహణలో మొత్తం 171 బిలియన్ డాలర్ల ఆస్తులున్నాయి. ఇక ఈ హ్యాకింగ్ వెనుక ఉత్తర కొరియాకు చెందిన సైబర్ కేటుగాళ్లు ఉన్నారని చెప్తున్నారు. ట్రేడర్ట్రైటర్ అనే సంస్థే ఈ హ్యాకింగ్‌కు కారణమని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అంటున్నది.
గత ఏడాది 1.5 బిలియన్ డాలర్ల హ్యాకింగ్ వెనుకా ఇదే ఉన్నదని గుర్తుచేస్తున్నది. ఈ నేపథ్యంలోనే క్రిప్టో ఎక్సేంజీలు, బ్లాక్‌చైన్ అనలిటిక్స్ కంపెనీలు, ఇతరులను అనుమానిత లావాదేవీలను నిలిపివేయాలని సూచించింది. దొంగిలించిన ఆస్తులను ట్రేడర్ట్రైటర్.. ఎంథీరమ్ క్రిప్టోకరెన్సీలోకి మార్చుతున్నట్టు ఎఫ్‌బీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు అపహరణకు గురైన క్రిప్టో ఆస్తులను తిరిగి రికవరీ చేస్తామన్న ధీమాను బైనాన్స్ ఎక్సేంజీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు 90 శాతం వెనక్కి వస్తుందంటున్న బైనాన్స్.. ఈ క్రమంలోనే దొంగిలించబడిన ఆస్తుల్లో దాదాపు 3 బిలియన్ డాలర్లను ఫ్రీజ్ చేయడానికి ఇతర క్రిప్టోకరెన్సీ సంస్థలతో కలిసి పనిచేసినట్టు కూడా పేర్కొన్నది.
ఈ నష్టం ఎవరిది?
బైనాన్స్ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజీలో హ్యాంకింగ్.. మదుపర్లకు అపార నష్టాన్నే మిగిల్చింది. దీంతో ఈ నష్టం ఇప్పుడు ఎవరు భరిస్తారు? అన్న సందేహాలు మార్కెట్‌వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఎక్సేంజీ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్, నిర్వహణలో ఉన్న ఆస్తులు ఎన్ని? అనే దానిపై ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఆస్తుల యాజమాన్య హక్కులు మదుపర్లకు ఉన్నా.. వాటి ట్రేడింగ్, ఇతరత్రా లావాదేవీలను ఎక్సేంజీలే చూసుకుంటాయని అంటున్నారు. అందుకే ఇక్కడ ఒప్పందాల్లో ఏమున్నదన్నది కీలకమని గుర్తుచేస్తున్నారు. అయితే సైబర్ దాడుల్లో వాటిల్లిన నష్టాలకైతే నిజానికి ఎక్సేంజీల వైఫల్యాలే కారణమని వివరిస్తున్నారు.
అయినప్పటికీ చట్టాలపరంగా చూస్తే మొత్తం బాధ్యతను ఎక్సేంజీలపైనే పెట్టలేమన్న తీర్పులు గతంలో వచ్చాయని పేర్కొంటున్నారు. కానీ ఈ నష్టాన్ని భర్తీ చేస్తామని ఈ కేసులో బైనాన్స్ హామీ ఇచ్చినందున మదుపర్లు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలనైతే వారు వెలిబుచ్చుతున్నారు. ఇక భారత్‌లో ఈ తరహా ఘటనల్ని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ-2002) కిందికి తెచ్చి చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ ఎక్సేంజీలు దివాలా తీస్తే దివాలా చట్టం (ఐబీసీ-2016) కింద మదుపర్ల ప్రయోజనాలను కాపాడేలా నిర్ణయాలను తీసుకుంటున్నారని లా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

