పాఠశాలల్లో ఘాతుకాల పాపమెవరిది?
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థిపై హేమంత్ అనే ఆకతాయి చెట్లను కట్ చేసే రంపంతో దాడికి పాల్పడ్డ ఉన్మాద ఘటన విద్యావ్యవస్థకు మాయనిమచ్చలా మారింది. ఇలాంటి దాడులు వరుసగా జరుగుతున్నప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు నియంత్రించలేకపోతున్నాయి.
ఏపీలోని రాప్తాడు జడ్పీ హైస్కూల్లో పదో విద్యార్థినిపై హేమంత్ అనే యువకుడు దాడికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. తర్వాత పోలీసుల కాల్పు ల్లో నిందితుడు తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నా డు. ఈ పరిణామాలు తల్లిదండ్రులు, గురువులు, సమాజానికి హెచ్చరికలు. బాల్యంపై నిర్లక్ష్యం భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు అని ఇంతకుముందే అనేక ఘటనలు రుజువు చేశాయి. ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడులో విద్యార్థిపై హేమంత్ అనే ఆకతాయి చెట్లను కట్ చేసే రంపంతో దాడికి పాల్పడ్డ ఉన్మాద ఘటన విద్యావ్యవస్థకు మాయనిమచ్చలా మారింది. ఇలాంటి దాడులు వరుసగా జరుగుతున్నప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు నియంత్రించలేకపోతున్నాయి. నల్లగొండ జిల్లా కొండ మల్లేపల్లి నాగార్జున పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఆగస్టు 11న ప్రిన్సిపల్ రూపాదేవిని ఆమె ఇంట్లో హత్య చేశారు. డబ్బు, బంగారంతో పరారయ్యారు. ఆ తర్వాత అరెస్టయ్యారు. జూలై 20న హరియాణాలోని ప్రభుత్వ పాఠశాలలో అల్లరి చేయవద్దని వారించిన టీచర్‌ను విద్యార్థి హత్య చేశాడు. అసోంలో జూలై 10న జుట్టును అడ్డదిడ్డంగా పెం చవద్దు అన్నందుకు విద్యార్థులు టీచర్‌ను కత్తితో పొడిచి చంపారు. పాఠశాలకు సెల్ ఫోన్ తీసుకురావద్దన్న ఉపాధ్యాయులపైనా కర్రలు, చెప్పులతో దాడికి పాల్పడిన పలు ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మీడియా సంస్థలు ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరమున్నది.
ఆరు, ఏడు తరగతుల నుంచే విద్యార్థులు ఆకర్షణకు లోనవుతూ ప్రేమ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారు. వ్యవహారాలు సాగిస్తున్నారు. సిగరెట్లు, మద్యానికి అలవాటు పడటం, ఆన్లైన్ గేమ్స్, ఇంటర్నెట్ దుర్వినియోగం, పుట్టినరోజు వేడుకలకు హోటల్స్‌లో, రోడ్లమీద, పార్కుల్లో పార్టీలు చేసుకోవడం, హంగామా సృష్టించడం పరిపాటిగా మారింది. ఫలితంగా విద్యార్థులకు చదువులపై ఆసక్తి తగ్గుతున్నది. వారిలో నిద్రలేమి, ఏకాగ్రత లోపిస్తున్నది. జల్సాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
సమీప పట్టణాల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులు మార్గమధ్యంలో పలు వ్యసనాలకు లోనవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు ఎక్కువగా చదువుకోకపోవడం, నిరక్షరాస్యులుగా ఉండడం విద్యార్థులు రెచ్చిపోతున్నారు. చదువుల కోసమే ఫోన్లు వాడుతున్నామని తల్లిదండ్రులకు చెప్తున్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా రకరకాల వింత పోకడలకు పాల్పడుతున్నారు. పిల్లల చదువుల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వలస వచ్చిన వారు కాయకష్టం చేసి పిల్లలను చదివిస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు, పనులకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడం వల్ల పిల్లల పట్ల నిఘా కొరవడుతున్నది. పలువురు విద్యార్థులు అశ్లీల చిత్రాల వీక్షణకు అలవాటు పడుతున్నారు.
విద్యార్థులు ఉపాధ్యాయులను కూడా లెక్క చేయడం లేదు. ఎంత చెప్పినా వినడం లేదు. గ్రూపులుగా తయారై ఉపాధ్యాయులనే బెదిరిస్తున్నారు. ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరిస్తే ఇబ్బందులు వస్తున్నది. మంచిగా చదివే విద్యార్థులు కూడా చెడు స్నేహాల వల్ల వ్యసనాలకు లోనవున్నారు. పిల్లలను పాఠశాలకు పంపడం మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత కాదు, క్రమశిక్షణ అనేది పెంపకంలో అత్యంత ముఖ్యమైన భాగం. చదువులో ప్రతిభతోపాటు మంచి ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నారు? పాఠశాల వదలగానే ఎక్కడికి వెళ్తున్నారు? సమయానికి ఇంటికి వస్తున్నారా లేదా? ఎవరితో ఎలా మాట్లాడుతున్నారు? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు? చదువులపై ఎంత శ్రద్ధ చూపుతున్నారు? పాఠశాల నియమాలను పాటిస్తున్నారా లేదా? అనే విషయాలను తల్లిదండ్రులు నిరంతరం గమనించాలి. పిల్లల తప్పులను సమర్థించడం లేదా వారిని వెనుకేసుకురావడం వల్ల భవిష్యత్తులో మరింత చెడిపోయే ప్రమాదం ఉన్నది. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతూ అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణలో విద్య కొనసాగాలి. విలువలతో కూడిన విద్యను అందించాలి. మంచి స్నేహం, ఆశయంతో కూడిన ఆలోచనలు, క్రమశిక్షణ అలవర్చాలి. చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతూ బాధ్యతయుతమైన, ఆదర్శవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్ )
మంగళారపు లక్ష్మణ్
9866335567
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

