కల్లోలిత ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1958లో పార్లమెంట్ ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్’ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా త్రివిధ దళాలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వబడ్డాయి.
మొట్టమొదటిసారి ఈ చట్టాన్ని ఈశాన్య భారతంలో 1958, సెప్టెంబర్ 11న ‘నాగాహిల్స్’ అసోంలో అమ లు చేశారు. కాలక్రమేణా ఈశాన్య రాష్ర్టాలైన సెవెన్ సిస్టర్స్‌గా పిలువబడే అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మే ఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం, త్రిపుర, సిక్కిం లకు విస్తరించింది. ఆ తర్వాత 1983లో పంజాబ్, ఛం డీగఢ్లలో అమలుచేసి 1997లో ఎత్తివేశారు. మణిపూర్‌లో తాజా అల్లర్ల సందర్భంలో ఈ చట్టం తిరిగి తెరమీదికి వస్తున్నది.1990లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్‌ను జమ్మూ కశ్మీర్లో అమలు చేసిన సమయంలో చట్ట పరిధి మరింత విస్తరించింది. భారతదేశ భూభాగ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ చట్టం ఒక రక్షణ కవచంలా పనిచేసింది. పాకిస్థాన్, చైనా వంటి శత్రుదేశాలతో సరిహద్దు వివాదాలు, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి వివిధ జాతులు, తెగల (కుకీలు, రోహింగ్యాలు) వలసల సమస్యలు ఉన్న ఉత్తర, తూర్పు భారతదేశంలో పకడ్బందీగా ఈ చట్టం అమలవుతున్నది.
ఈశాన్య రాష్ర్టాల్లో రక్షణ దళాలు ఈ చ ట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఐర న్ లేడీ ఆఫ్ మణిపూర్‌గా పేరున్న ఇరోం షర్మిల ఈ చట్టాన్ని తొలగించాలని సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేశారు. కాలక్రమేణా కేంద్ర ప్రభు త్వం ఈ చట్టం పరిధిని తగ్గిస్తూ ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో పూర్తిగా, ఈశాన్య రాష్ర్టాల్లోని 31 జిల్లాల్లో పాక్షికంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం విడతలవారీగా ఈ చట్టాన్ని నాగాలాండ్, మణిపూర్లలో పూర్తిగా ఎత్తివేసింది.
2023 మే 3 న మణిపూర్‌లో రెండు తెగలు (మెయితీ, కుకీ)ల మధ్య మెదలైన అల్లర్లలో 142 మంది ప్రాణా లు కోల్పోయారు. వేలమంది క్షతగాత్రులయ్యారు. లక్షలాదిమంది నివాసం కో ల్పోయారు. ఇలా అన్ని విధాలుగా ప్రా ణ, ఆస్తి నష్టం, ఆఖరికి మాననష్టం (ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం)కూడా జరిగింది. అధికార బీజేపీ ప్రభుత్వం 144 సెక్షన్, కర్ఫ్యూ లాంటివి విధించినా పరిష్కారం కాలేదు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. శాంతి భద్రతల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు, పార్టీలు ఈ విషయాన్ని ఒక పొలిటికల్ మైలేజీగా చూస్తున్నాయి.
మణిపూర్ మంటలు చల్లారాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలి. ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసి తిరిగి అమలు చేయాలి. ముఖ్యంగా జా తుల వైరాన్ని నివారించడం కోసం మానవీయకోణంలో నిర్ణయాలు తీసుకోవాలి.
-బందెల సురేందర్‌రెడ్డి
83749 72210