పల్లెలు రాష్ట్రదేశవరభాగ్యములన్ సమకూర్చునట్టివౌ
ముల్లెలు, వాని యభ్యుదయపూర్తికి కంకణబద్ధమైనదీ
యెల్లరిదైన పాలన మహీతలి మెచ్చగవాడవాడలన్
వెల్లువ లెత్తరా ప్రగతి పేదలసేవకు నూత్నతేజమై!
సకలజనావళీప్రగతి చక్కగ సాగగ, నార్థికమ్ముగా
ప్రకటితమయ్యె సాయములు పంటల వృద్ధికి, రైతుమేలుకున్
చకచక సాగుచుండె పలు సత్పథకమ్ములు, వానితోడనే
వికసన సాగుచుండె పలువేదికలన్ జనవాణి మెచ్చగా!
గ్రామములేకదా జనుల కాంతులనిల్పును, వానివృద్ధికై
యేమరుపాటులేని గణనీయపు పాలన ముందుచూపుతో
క్షేమకరమ్ములైన పలుసేవల జేయుచునుండె నిత్యమున్
ప్రేమగకోరికోరి పలురీతుల నభ్యుదయమ్ము వెల్గగా!
జనహితమై, జనావళికి సర్వమునీయగ నిల్చినట్టిదౌ
ఘనమగు పాలనమ్మునకు కాంచనమార్గము వేయుచుండగా
ననయము చంద్రకాంతివలె హ్లాదమునీయగ నుద్యమమ్ముతో
ఘనుడగు చంద్రశేఖరుడు కాంతినొసంగుచుజేయు సేవలన్!
కలల బంగారు తెలగాణ గాంచుకొరకు
వివిధ రీతుల రచియించి వేలకృతుల
భవ్యపథమున రథములు పరుగుదీయ
సాగుచెండెను పాలన జనహితముగ!
-డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ ,94404 68557