భాషంటే ఒకటే అనుకుంటాం
కానీ భాష ద్విరూపి కావ్య భాషే కమనీయమన్నారు ఓ నాడు పద్య భాషే ప్రామాణికమన్నారు ఆనాడు గ్రాంథిక భాషే గణనీయమన్నారు మరునాడు వ్యవహారికమే విలువైనదన్నారు ఈనాడు
ప్రతి దశలోనూ భాష రెండు సమాంతర నదులుగా ప్రవహించింది మార్గ, దేశీ దశలుగా గ్రాంథికం, వ్యావహారికంగా బడి పలుకులు, పలుకుబడులుగా ఒకే జన్మలో రెండు బతుకులు బతికింది
ఐనా మనకెందుకులే ఆ బాధ కోయిల పాటని మానేసి కొరియన్ పాప్‌ని దిబ్బరొట్టె సర్వపిండిని ఆపేసి పిజ్జా బర్గర్‌ని రామాయణ భారతాలు చదవటం ఆపేసి విష సంస్కృతి సీరియల్స్‌కి మారబడ్డ వాళ్లం కదా మనం
భాషా ప్రేమికుల్లారా బాధ పడకండి ఈ తరానికి భాషంటే smsసే కిచిడీ మాటల మల్టీ మీడియానే ఇప్పుడు భాషకి కొత్త తొడుగు తయారయ్యింది చాట్ జీపీటీ సింగారంతోAi మెరుపులతో హొయలు పోతుంది తెలుగు భాషిప్పుడు బైనరీ కోడ్‌తో డిజిటల్ స్వరాలుగా పలుకుతుంది
పలకను గిరాటేసి ట్యాబ్‌పై అక్షరాలూ దిద్దుకుంటున్న పిల్లల్లారా!
మనందరం ఓ రహస్యం చెప్పుకుందామా! గూగులే మనందరి సామూహిక అమ్మ గూగులమ్మ పలికేదే ఈ కాలపు మాతృభాష!