గ్రీన్‌కార్డుకు సుగమం!

ట్రంప్ హయాంలో అనేక ఇబ్బందులకు, అనిశ్చితికి లోనైన భారతీయ అమెరికన్లు బైడెన్ నేతృత్వంలో డెమొక్రటిక్ ప్రభుత్వం ఏర్పా టు కాగానే హమ్మయ్య అనుకున్నారు. భారతీయులు తన మీద పెట్టుకున్న ఆశలను బైడెన్ వమ్ము చేయలేదని అమెరికా హౌజ్ జ్యుడీషియల్ కమిటీ తాజాగా విడుదల చేసిన రీకన్సిలియేషన్ బిల్లు స్పష్టం చేస్తున్నది. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించి, ఆ దేశ పౌరసత్వాన్ని అందించే గ్రీన్‌కార్డును దక్కించుకోవటానికి ఈ బిల్లు మార్గం సుగమం చేసింది. దీనివల్ల అమెరికాలో తాత్కాలిక వీసాపై ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడాలనుకుంటున్న విదేశీ నిపుణులకు, చిన్నప్పుడు తల్లిదండ్రులతోపాటు వెళ్లి అక్కడే ఉండిపోయి ప్రస్తుతం 21 ఏండ్లకు చేరుకుంటున్నవారికి (డ్రీమర్లకు) ఎంతో మేలు జరుగనున్నది.
హెచ్-1బీ వంటి తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు గ్రీన్‌కార్డు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే పరిస్థితి ప్రస్తుతం ఉంది. వీరిలో కొందరు 80 ఏండ్లకుపైగా వేచి చూడాల్సి ఉంటుంది. దాదాపు 2 లక్షల మంది తమ జీవితకాలంలో గ్రీన్‌కార్డును పొందలేరు. ఏ దేశానికైనా ఏడు శాతానికి మించి ఉద్యోగ సంబంధిత గ్రీన్‌కార్డులు ఇవ్వకూడదనే నిబంధన వల్ల అధిక జనాభా ఉన్న భారత్ వంటి దేశాలకు ఇబ్బంది కలుగుతున్నది. 2017 నుంచి ఈ ఏడాది జనవరి వరకూ అధికారంలో ఉన్న ట్రంప్ కారణంగా ఈ సమస్య మరింత సంక్లిష్టమైంది. విదేశీ నిపుణుల వల్లనే అమెరికన్లకు ఉద్యోగాలు లభించటం లేదనే వాదనను ప్రచారం చేయడమే కాకుండా, వలసలను అడ్డుకోవటానికి, తాత్కాలిక వీసాలతో ఉన్నవారిని పంపించటానికి ట్రంప్ ప్రయత్నించారు. వీటికి అక్కడి టెక్ కంపెనీలు, కోర్టులు కొంతవరకైనా అడ్డుపడటం మరో సంగతి.
నిజానికి.. విదేశీ నిపుణులకు అమెరికా వంటి అపార అవకాశాలున్న దేశం ఎంత అవసరమో, ఆ దేశానికీ వివిధ రంగాల నిపుణులు అంతే అవసరం. అయితే, హెచ్-1బీ వంటి తాత్కాలిక వీసాలతో పనిచేస్తున్నవారి మీద వాటిని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవా ల్సి రావటం, ఉద్యోగాలు మారడానికి, సొంత వ్యాపారం చేయడానికి స్వేచ్ఛ లేకపోవడం, స్థిరాస్తులను కొనటానికి అనుమతి లేకపోవటం వంటి ఎన్నో ఆంక్షలున్నాయి. వీటివల్ల ఆ వీసాదారులు తమ శక్తిసామర్థ్యాలను పూర్తిగా వెచ్చించలేకపోతున్నారు. ఇది అమెరికా ఆర్థికవ్యవస్థకు నష్టం చేస్తోంది. మరోవైపు, నిపుణులను ఆకర్షించి అక్కున చేర్చుకోకపోతే చైనా వంటి దేశాలతో పోటీపడటం కష్టం. ఈ నేపథ్యంలోనే అమెరికా కొత్త బిల్లు తీసుకువచ్చింది. అయితే ఈ బిల్లు కొంత వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ, విధానపరమైన మార్పు కాదు. దేశాల వారీ గ్రీన్‌కార్డుల కోటాను ఎత్తివేయటం, హెచ్-1బీ వీసాల వార్షిక కోటాను పెంచటం వంటి ప్రతిపాదనలు ఈ బిల్లులో లేవు. వీటిని కూడా చేరిస్తే అమెరికా ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ’గా పేరు నిలుపుకొంటుంది.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

