e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home ఎడిట్‌ పేజీ ‘గౌరవం’ పెంపు

‘గౌరవం’ పెంపు

‘గౌరవం’ పెంపు

ఆచరణయోగ్యం కాని ఆదర్శాలకు పోకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నది. ప్రజా సేవకులు అంటే సర్వసంగ పరిత్యాగులుగా ఉండాలనే రొడ్డకొట్టుడు విధానానికి చెల్లుచీటీ చెప్పింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న ఆశావర్కర్లు, సెర్ప్‌ ఉద్యోగులు, విలేజ్‌, రెవెన్యూ అసిస్టెంట్ల గౌరవ వేతనాలను ముప్పై శాతం పెంచింది. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో జీతభత్యాలను పెంచిన కేసీఆర్‌ ప్రభుత్వం, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులకు కూడా అదే స్థాయిలో గౌరవ వేతనాలను పెంచి సముచిత నిర్ణయం తీసుకున్నది. దీనివల్ల సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీల వంటి స్థానిక ప్రజాప్రతినిధులు 18 వేల మంది లబ్ధి పొందనున్నారు. ఖజానాపై 550 కోట్ల భారం పడినా ప్రభుత్వం ఉదార నిర్ణయం తీసుకొని సంక్షేమ పాలనకు అద్దం పట్టింది. దీంతో స్థానికంగా నిత్యం సేవలందిస్తున్న వారి బాధ్యతలనూ పెంచినట్లయ్యింది.

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత అన్ని రంగాలలో, పాలనా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీత భత్యాలను కాలానుగుణంగా పెంచే పనిని బాధ్యతగా స్వీకరించింది. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల నుంచి స్థానికసంస్థల దాకా జీతభత్యాలను పెంచింది. గతంలో ఎమ్మెల్యేకు రూ. 12 వేల గౌరవ వేతనం ఉండేది. ఈ వేతనంతో ఒక ప్రజాప్రతినిధి తన కుటుంబాన్ని పోషించుకుంటూ, సమస్యల పరిష్కారం కోసం ఇంటికి వచ్చే ప్రజలకు కనీసం చాయ్‌ కూడా ఇవ్వగల పరిస్థితి ఉంటుందా అని ఓ సందర్భంలో కేసీఆర్‌ అన్న మాటలు అందరినీ ఆలోచింపజేసేవి. ఇలా దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని ఎన్నో సమస్యలను గుర్తించడం కేసీఆర్‌ వంటి పరిపాలకులకే సాధ్యం.

- Advertisement -

రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు అనగానే, తమకంటూ ఏమీ లేకుండా సమాజ ఉద్ధారకులుగా ఉండాలనే పాతకాలపు అభిప్రాయం ఒకటి పాతుకొని ఉన్నది. నిరాడంబరత అంటే కడుపు మాడ్చుకోవటం కాకూడదు. స్వాతంత్య్రానంతర కాలంలో కొన్ని దశాబ్దాలు తమకంటూ జీతభత్యాలు తీసుకోకుండా పనిచేసిన కాలమొకటి ఉన్నది. ఆ కాలం నేతలంతా కులీనవర్గాల నుంచి ఉన్నతాదర్శాలతో రాజకీయాల్లోకి వచ్చినవారు. ప్రజాస్వామ్య విలువకు ప్రతీకగా నేడు పేద కుటుంబంలోని సామాన్యుడు కూడా చట్టసభల్లో అడుగుపెడుతున్నాడు. అతని గౌరవప్రద జీవితం సమాజగౌరవానికీ ఉన్నతికీ నిదర్శనమే. మనల్ని మనం గౌరవించుకోవటమే. తాజా గౌరవ వేతనాల పెంపు అవినీతిరహిత, బాధ్యతాయుత పాలనకు పునాదిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘గౌరవం’ పెంపు
‘గౌరవం’ పెంపు
‘గౌరవం’ పెంపు

ట్రెండింగ్‌

Advertisement