మంగళవారం 31 మార్చి 2020
Editorial - Mar 17, 2020 , 23:20:27

సార్క్‌ సౌభ్రాతృత్వం

సార్క్‌ సౌభ్రాతృత్వం

చైనా తర్వాత జనసాంద్రత ఎక్కువ కలిగిన దక్షిణాసియాలో వైరస్‌ విస్తరిస్తే పెను ఉపద్రవమే. సార్క్‌ దేశాలన్నింటా ఒకేవిధమైన వాతావరణ పరిస్థితులుంటాయి. జీవనరీతులు, ప్రమాణాలు కూడా దాదాపుగా ఒకే స్థాయిలో ఉంటాయి. అయినా ఈ దేశాల్లో ఒక్కో దేశానిది ఒక్కో సమస్య. మాల్దీవులకు వైరస్‌ను నిలువరించే ఆర్థిక, వైద్య, శాస్త్రపరిజ్ఞానం తగినంతగా లేదు. నిధుల కొరత సరేసరి. శ్రీలంక, భూటాన్‌ లాంటి దేశాలు చిన్నవైనా టూరిజం గణనీయంగా ఉంటుంది. గరిష్ఠ స్థాయిలో ప్రపంచ దేశాలనుంచి సందర్శకులుంటారు. కాబట్టి వైరస్‌ విస్తరణ ప్రమాదం ఎక్కు వ.

దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్‌) పునరుజ్జీవనానికి కరోనా వైరస్‌ పరోక్ష దోహదకారిగా మారుతున్నది. బద్ధ శత్రువులైనా ఆపద సమయాల్లో దగ్గరవుతారన్న నానుడిని నిజం చేస్తూ ఇన్నాళ్లూ ఎడమొఖం, పెడమొఖంగా ఉన్న దేశాలు ఏకతా టిపైకి వచ్చి చేయిచేయి కలుపుతున్నాయి. దక్షిణాసియా దేశాల్లో వైరస్‌ విస్తరించకుండా కట్టడి చేసేందుకు కలిసి నడువటానికి సమాయత్తమవుతున్నాయి. పాకిస్థాన్‌తో సహా సార్క్‌ సభ్యదేశాలన్నీ భారత్‌ పిలుపునకు సానుకూలంగా స్పందించాయి. దేశ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19ని ఎదుర్కోవటం కోసం సార్క్‌ దేశాల మధ్య పరస్పర సహకారం ఆవసరమని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు సార్క్‌ దేశాధినేతల నుంచి తక్షణ స్పందన లభించింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మోదీ ప్రతిపాదించిన వెంటనే సార్క్‌ సభ్యదేశాధినేతలంతా దృశ్య మాధ్యమ సదస్సులో భాగస్వాములవటం ముదావహం.


సార్క్‌ దేశాల మధ్య గత నాలుగేండ్లుగా సయోధ్య లేదు. భారత్‌లో ‘యురి’ ఉగ్రదాడి నేపథ్యంలో 2016లో పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరుగాల్సిన సార్క్‌ సదస్సును భారత్‌తో సహా మిగతా సభ్య దేశాలన్నీ బహిష్కరించాయి. పాకిస్థాన్‌ తన భూభాగాన్ని ఉగ్రవాదానికి స్థావరంగా చేయటం మానేయాలని  డిమాండ్‌ చేశాయి. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే టెర్రరిజానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరులో పాక్‌ పాత్రను విశ్వసిస్తామని తేల్చి చెప్పా యి. అప్పటినుంచి ఈ ప్రాంతీయ కూటమి ద్వారా సాగే దౌత్య, రాజకీయ సంబంధాలు నామమాత్రంగా మిగిలిపోయాయి. ప్రాంతీయాభివృ ద్ధి, వర్తక వాణిజ్యాల కోసం సభ్యదేశాల మధ్య అత్యున్నత రాజకీయచర్చలు జరుగాలని శ్రీలం క, నేపాల్‌, మాల్దీవులు అప్పటినుంచీ కోరుతున్నాయి. 


కానీ దానికి తగిన రాజకీయ వాతావర ణం లేదని భారత్‌ చెబుతూ వచ్చింది. కోరలు చాస్తున్న కోవిడ్‌ కాటునుంచి దక్షిణాసియా ప్రాం తాన్ని సంరక్షించుకోవాలంటే ముందస్తు చర్యలు అవసరమని గుర్తించిన భారత్‌ తగురీతిన చొరవ తీసుకున్నది. సార్క్‌ సభ్యదేశాలైన ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియా, మాల్దీవులు, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాల అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రతిపాదించింది. మోదీ ప్రతిపాదనకు సార్క్‌ నేతలంతా స్వల్పవ్యవధిలో నే స్పందించారు. నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ శస్త్రచికిత్స చేసుకొని దవాఖాన నుంచి బయటకు వచ్చిన మరునాడే పాలుపంచుకోవడాన్ని బట్టి సదస్సుకు లభించిన ప్రాధాన్యం అవగతమవుతున్నది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం నేరు గా భాగస్వామి కాకుండా ఆరోగ్యరంగ సలహాదా రు జాఫర్‌ మీర్జాను నియోగించారు. ఎప్పటిలాగే ఈ సందర్భంగా కూడా పాకిస్థాన్‌ రాజకీయ ప్రస్తావనలు చేసి వక్రబుద్ధిని చాటుకున్నది. మానవాళికి ప్రమాదం ముంచుకొస్తున్న పరిస్థితుల్లో కూడా మానవీయంగా స్పందించేబదులు రాజకీయాలు చేయటం గర్హనీయం.


చైనా తర్వాత జనసాంద్రత ఎక్కువ కలిగిన దక్షిణాసియాలో వైరస్‌ విస్తరిస్తే పెను ఉపద్రవమే. సార్క్‌ దేశాలన్నింటా ఒకేవిధమైన వాతావరణ పరిస్థితులుంటాయి. జీవనరీతులు, ప్రమాణాలు కూడా దాదాపుగా ఒకే స్థాయిలో ఉంటాయి. అయినా ఈ దేశాల్లో ఒక్కో దేశానిది ఒక్కో సమస్య. మాల్దీవులకు వైరస్‌ను నిలువరించే ఆర్థిక, వైద్య, శాస్త్రపరిజ్ఞానం తగినంతగా లేదు. నిధుల కొరత సరేసరి. శ్రీలంక, భూటాన్‌ లాంటి దేశాలు చిన్నవైనా టూరిజం గణనీయంగా ఉంటుంది. గరిష్ఠస్థాయిలో ప్రపంచ దేశాలనుంచి సందర్శకులుంటారు. కాబట్టి వైరస్‌ విస్తరణ ప్రమాదం ఎక్కు వ. ఈ దేశాలన్నింటా విస్తారంగా ఉన్న గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో  వైరస్‌ మరింత ప్రమాదభరితంగా మారే అవకాశం ఉన్నది. అందుకే కోవిడ్‌-19ను నిలువరించటం కోసం ప్రధాని మోదీ ఇప్పటికే కోటి డాలర్ల సాయాన్ని ప్రకటించి, మిగతా దేశాలకు మార్గదర్శకంగా నిలిచారు. పొరుగు దేశాల వినతి మేరకు వైద్య బృందాలను పంపేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. 


మాల్దీవుల విజ్ఞప్తి మేరకు 48 గంటల్లోనే భారత్‌ అత్యవసర వైద్యసిబ్బందిని పంపించింది. ఇరాన్‌ చేసి న వినతులను కూడా మానవతా దృక్పథంతో పరిశీలిస్తున్నట్లు భారత్‌ తెలిపింది. కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చొరవను అమెరికా, రష్యా దేశాధినేతలు కూడా శ్లాఘించటం గమనించదగినది. సార్క్‌ తరహాలో జీ-20 దేశాలు కూడా ఆన్‌లైన్‌ యంత్రాంగం తో అనుసంధానమవ్వాలని భారత్‌ ప్రతిపాదించింది. ఇది భారత్‌ బాధ్యతాయుత వైఖరికి నిదర్శనం. కేవలం కోవిడ్‌ను ఎదుర్కొనడానికే పరిమితం కాక సార్క్‌ మరింత ముందడుగు వేయాలి. సార్క్‌ దేశాల మధ్య అన్నిరంగాల్లో సహకారం నెలకొనాలె. ఇదే దక్షిణాసియాకు శ్రీరామ రక్ష!


logo
>>>>>>