కొత్తగూడెం సింగరేణి, జనవరి 8 : అపరిష్కృతంగా ఉన్న కోర్టు కేసుల పరిష్కారం విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ఆయా కేసులకు సంబంధించి న్యాయస్థానానికి సమర్పించాల్సిన సమాచారం సకాలంలో అందించాలని సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్ బలరాం ఆదేశించారు. కొత్తగూడెం హెడ్డాఫీస్ నుంచి శనివారం పర్సనల్, ఎస్టేట్స్, న్యాయ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో కోర్టు కేసుల విషయంలో జాప్యం చేయవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం కంపెనీ వ్యాప్తంగా దాదాపు 950 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటి పరిష్కారం కోసం న్యాయ విభాగానికి కావాల్సిన సమాచారాన్ని సంబంధిత ఏరియా పర్సనల్ విభాగం అధికారులు జాప్యం లేకుండా అందించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి కేసుల పరిష్కారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని రీజినల్ న్యాయ శాఖ అధికారుల ద్వారా హైదరాబాద్ న్యాయ విభాగానికి పంపించాలని సూచించారు. కంపెనీ చేపట్టబోయే నూతన ప్రాజెక్టుల భూ సేకరణ తదితర విషయాల్లో దాఖలవుతున్న కేసుల విషయంలోనూ ఎస్టేట్స్ అధికారులు సత్వరమే స్పందించాలని, జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని సమన్వయపర్చుకొని ముందుకెళ్లాలన్నారు. ఏరియాల వారీగా పెండింగ్ కేసులపై హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్ సమీక్షించారు. సమావేశంలో జీఎం (ఎస్టేట్స్) వెంకటేశ్వరరెడ్డి, లా మేనేజర్ శిరీషారెడ్డి, డీజీఎం (ఎస్టేట్స్) విజయ్‌కుమార్, సూపరింటెండెంట్ ఇంజినీర్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొరాజ్యాంగ పుస్తకం, క్యాలెండర్ ఆవిష్కరణ..
సింగరేణి కార్పొరేట్ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం పుస్తకం, క్యాలెండర్‌ను డైరెక్టర్ ఆవిష్కరించారు. రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని, అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు, జీఎం పర్సనల్ ఆనందరావు, బసవయ్య, జీఎం ట్రాన్స్‌పోర్టు దామోదర్, సేఫ్టీ జీఎం గురవయ్య, ఏజీఎం శ్రీకాంత్, ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆంతోటి నాగేశ్వరరావు, టీబీజీకేఎస్ కార్పోరేట్ ఉపాధ్యక్షుడు ఎంఆర్‌జీకే మూర్తి, లైజన్ ఆఫీసర్ కలవల చంద్రశేఖర్, మాల కొండయ్య, సెంట్రల్ కమిటీ మెంబర్లు మల్లేశ్, విజేందర్, మనీష్ విక్టర్, బి.స్వామి, సాయికృష్ణ, రాజేశ్వరరావు, హాతీరాం, అల్లి శంకర్ పాల్గొన్నారు.