
మనోహరాబాద్, డిసెంబర్ 30 : మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం గూడూరులో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్మార్ట్ఫోన్లను అందజేశారు. అనంతరం ఏఆర్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కుట్టుమిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన అంగన్వాడీ కేంద్రాలను ఏ ర్పాటు చేయడమే కాకుండా టీచర్లకు గౌరవవేతనాన్ని పెంచారని గుర్తు చేశారు. స్త్రీ సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. మహిళా సంఘాలోని మ హిళలు స్వయం ఉపాధి పొందేందుకు రూ. 10 లక్షల వరకు అం దజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్య క్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మండల అధ్యక్షుడు రాజారమణగౌడ్, ఐసీడీఏస్ సీడీపీవో హేమభార్గవి, సూపర్వైజర్ కవిత, స్వరూప, సరళ, జ్యోతి, శశికళ,ఏఆర్ఈఎస్ ప్రతినిధులు సుకన్య, సునితా, సర్పంచ్ స్వరాజలక్ష్మి పాల్గొన్నారు.
వీ మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభం
నర్సాపూర్, డిసెంబర్ 30: నర్సాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీ మార్ట్ సూపర్ మార్కెట్‌ను ఎ మ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు వీ మార్ట్ అందుబాటులోకి రావడం చాలా సంతోషం గా ఉందన్నారు. అనంతరం నిర్వహకులు ఎమ్మెల్యే, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, జడ్పీటీసీ బా బ్యానాయక్, కౌన్సిలర్లు అశోక్‌గౌడ్, బుచ్చేశ్‌యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చం ద్రశేఖర్, నిర్వాహకులు గురుప్రసాద్, అశోక్, శ్రీనివాస్,మహేశ్ పాల్గొన్నారు.
ఆలయ పున: నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం
నర్సాపూర్ పట్టణ శివారులోని హైదరాబాద్ మార్గంలోని అయ్యప్ప స్వామి ఆలయ పునఃనిర్మాణానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడు తూ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి కృ షి చేస్తానని వెల్లడించారు. అలాగే దాతలు ముందుకు వచ్చి ఆలయ పునఃనిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ క మిటీ చైర్పర్సన్ అనసూయ అశోక్‌గౌడ్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఏఎంసీ డైరెక్టర్ రావూఫ్, టీఆర్ఎస్ నా యకుడు శ్రీధర్‌గుప్తా, అయ్యప్ప స్వాములు నాగరాజు, దేవాగౌడ్, శ్రీశైలం పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ అందజేసిన ఎమ్మెల్యే..
వెల్దుర్తి, డిసెంబర్ 30: మాసాయిపేట మం డల బొమ్మారం గ్రామానికి చెందిన పెద్దులు అనారోగ్యానికి గురికావడంతో వైద్య ఖర్చులు కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నా డు. మంజూరైన రూ. 60 వేల చెక్కును నర్సాపూర్ ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సర్పం చ్ శంకర్‌కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పా ల్గొన్నారు