కందుకూరు :నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అగర్మియగూడ మాజీ ఉప సర్పంచ్ వడ్డెపల్లి రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు జంగారెడ్డి, వెంకట్‌రెడ్డి,పాండులతో కలిసి అగర్మియగూడ గేటు నుంచి గ్రామం వరకు డబుల్ రోడ్డును మంజూరు చేయాలని కోరుతూ, సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నిధులను మంజూరు చేసి మౌళికవసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. గ్రామాలకు కావాల్సిన నిధులను కేటాయించి ప్రణాళికబద్ధంగా అభివృద్ది చేస్తానని చెప్పారు. గ్రామాలకు రోడ్లు, సీసీ రోడ్లు, అండర్‌డ్రైనేజి పనులకు నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
రాష్ట్రం ఏర్పడిన అనంతరం రోడ్లుకు ప్రాధాన్యతను ఇస్తు ప్రతి గ్రామానికి రోడ్డు వసతిని కల్పిస్తున్నట్లు వివరించారు. సమస్యలను తన దృష్టికితెస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా వెనుబడి పోయిన గ్రామాలు రాష్ట్రం ఏర్పడిన అనంతరం అభివృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రశాంత్‌రెడ్డి, అశోక్, యాదగిరిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాములు, పెద్దిరాజులు పాల్గొన్నారు.