
ఖమ్మం డిసెంబర్ 22: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏ డివిజన్‌లోనూ ఇక మట్టిరోడ్డు అనేది కనిపించకుండా పూర్తిగా సీసీల నిర్మాణం చేపడుతానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరం 4వ డివిజన్ పరిధిలోని రాజీవ్‌నగర్ గుట్టలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ తరువాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఏ డివిజన్‌ను చూసినా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతుండడం కనిపిస్తోందన్నారు. గత పాలకుల హయాంలో ఖమ్మంలో సమస్యలు ఎక్కడిగొంగళి అక్కడే అనే చందంగా మూలుగుతూ కనిపించేవని విమర్శించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కార్పొరేటర్‌గా గెలుపొందిన నాటి నుంచి నిత్యం డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి భరోసాను కల్పిస్తున్న 4వ డివిజన్ కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సేవ చేస్తున్నందుకు మెచ్చుకున్నారు. కేఎంసీ మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, నాయకులు వంటికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జోగుపర్తి ప్రభాకర్, షేక్ వలీ, తంగెళ్లపల్లి శ్రీనివాస్, సతీశ్‌గౌడ్, కొలేరి సురేశ్, దయాకర్, ఎడెల్లి భిక్షం, ప్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.
బస్ షెల్టర్‌ను ప్రారంభించిన మంత్రి
రఘునాథపాలెం మండలం కోయచలక క్రాస్‌రోడ్డులో ఊట్ల దీప్తి జ్ఞాపకార్థం కాంపాటి పిచ్చయ్య కుటుంబ సభ్యులు నిర్మించిన బస్ షెల్టర్‌ను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బుధవారం ప్రారంభించారు. ప్రయాణికులు సేదదీరేందుకు బస్ షెల్టర్‌ను నిర్మించిన దాతలను మంత్రి అభినందించారు. మాజీ జడ్పీటీసీ కుర్రా భాస్కర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఆత్మ చైర్మన్ భుక్యా లక్ష్మణ్‌నాయక్, కోయచలక, రేగులచలక, రఘునాథపాలెం సర్పంచ్‌లు మాదంశెట్టి హరిప్రసాద్, కొర్లపాటి రామారావు, గుడిపుడి శారద, ఎంపీటీసీ బలుసుపాటి సుజాత, టీఆర్ఎస్ నాయకులు చెరుకూరి పూర్ణచందర్రావు, నున్నా శ్రీనివాసరావు, తోట వెంకట్, నున్నా వెంకటేశ్వర్లు, బలుసుపాటి నాగేశ్వరరావు, దాతలు ఊట్ల లెనిన్కుమార్, డాక్టర్ నల్లబోతు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.