మైలార్‌దేవ్‌పల్లి : ప్రయాణీకుడిలా ఆటో ఎక్కి డ్రైవర్‌కు కత్తి చూపించి, బెదిరించి నగదు సెల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జల్ పల్లి ఎర్రకుంట ప్రాంతానికి చెందిన మోసీన్ (26) ప్యాసింజర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ప్రతి రోజు మాదిరిగానే బుధవారం రాత్రి ఆరాంఘర్ నుండి శంషాబాద్‌కు నలుగురు ప్యాసింజర్లను తీసుకెళ్తున్న ఆటోడ్రైవర్ సయ్యద్ మోసీన్ మరి కొంత ముందుకు వెళ్లాక మరో ప్యాసింజర్‌ను ఎక్కించుకున్నాడు. గగన్ పహాడ్ వద్ద నలుగురు ప్రయాణీకులు దిగిపోయారు. ఆటోలో తరువాత ఎక్కిన ప్రయాణీకుడు ఉన్నాడు.
మరి కొద్ది దూరం వెళ్లగానే వెనుక కూర్చున్న వ్యక్తి చీకటిలో వెనుక నుండి కత్తిని చూపగానే భయపడ్డ మోసీన్ ఆటోను వదిలి పారిపోయాడు. దీంతో ఆటోలో ఉన్న 3200 రూపాయల, సెల్ ఫోన్‌ను తీసుకుని దుండగుడు పారిపోయాడు. జరిగిన విషయాన్ని మోసీన్ మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.