
మల్దకల్, డిసెంబర్ 18 : మండలకేంద్రంలోని ఆదిశిలా క్షేత్రంలో కల్యాణం కమనీయంగా సాగింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో లక్ష్మీ, భూదేవి, వేంకటేశ్వర స్వామి కల్యాణం కను ల పండువగా జరిగింది. వేద పండితులు సంతోష్‌చారి, అ భినయ్, మధుసూదనాచారి, రమేశాచారి వేదమంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అంతకుముందు స్వామిని గజవాహనంపై గ్రామంలోని దశమి కట్ట వరకు ఊరేగించారు. అక్కడ లగ్న పత్రికను భక్తులకు చదివి వినిపించి వివాహానికి ఆహ్వానించారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకొని కల్యా ణ ఘట్టాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ప్రభోత్సవం నిర్వహించారు. వేడుకకు ఉమ్మడి జిల్లాతోపాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు త లెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చే సింది. ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు బం దోబస్తు నిర్వహించారు. కల్యాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ కమిటీ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు. ఎ మ్మెల్యే ఆదేశాల మేరకు ఎంపీపీ రాజారెడ్డి దం పతులు స్వామికి పట్టువస్ర్తాలు సమర్పించారు.