
మహబూబ్‌నగర్, డిసెంబర్ 10 : అప్పాయిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్ర మాదం తనను ఎంతో కలిచివేసిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జనరల్ దవాఖానలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కు టుంబ సభ్యులను గాయపడిన వారిని మంత్రి పరామర్శించారు. మార్చురీ వద్దకు వెళ్లి మృతదేహాల వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాద విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, ఆయన సానుకూలంగా స్పందించార ని తెలిపారు. బాధితులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. మృతుల కుటుంబాలకు డబుల్బెడ్రూం ఇండ్లతోపాటు వారి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల వివరా లు సేకరించేందుకు ఓ తాసిల్దార్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించొద్దని, ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాగించాలని సూచించారు. ఆర్టీఏ అధికారులు నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి ప్రమాదాలకు కారణం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కులవృత్తులకు న్యాయం చేస్తున్నాం..
కులవృత్తులకు జీవంపోస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆధునికతను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని చెప్పారు. పాతపాలమూరు వద్ద రూ.52 లక్షలతో నిర్మించిన ఆధునిక దోబీఘాట్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రతి జిల్లాలో ఆధునిక దోబీఘాట్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కులవృత్తులకు మరింత జీవం పోసి ప్రతి వ్యక్తికి పని కల్పించామని చెప్పారు. అందరూ ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే టీడీగు ట్ట వద్ద ఉన్న రామాంజనేయ ఆలయంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప పడి పూజలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాచన్‌పల్లి తండాకు చెందిన జ్యోతికి రూ.4 లక్షలు, వీరన్నపేటకు చెందిన అనితకు రూ.25 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ సంస్థ ఎల్ఐసీని ప్రైవేటీకరణను ఆపాలని రూపొందించిన కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. కాగా గురువారం రాత్రి క్లాక్‌టవర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గ్లోబ్‌ను పరిశీలించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, వాషర్మెన్ ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, డీఈ సుబ్రహ్మణ్యం, రాములు, రజక సంఘం ప్రతినిధులు పురుషోత్తం, కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు నవకాంత్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.