Provide employment | ‘ప్రాజెక్ట్ ప్రిషా’ ద్వార ఉపాధి కల్పిస్తున్నాం: దోసపాటి రాము

మన్సూరాబాద్ : కరోనా సృష్టించిన కల్లోలంతో జీవనోపాధి కోల్పోయిన ఎంతో మందికి ‘ప్రాజెక్ట్ ప్రిషా’ ద్వార ఉపాధి కల్పించి చేయూతనిచ్చామని రైస్ ఏటీఎం ఫౌండర్, సామాజిక కార్యకర్త దోసపాటి రాము తెలిపారు.
‘ప్రాజెక్ట్ ప్రిషా’ సంస్థను నెలకొల్పి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం నాగోల్ డివిజన్ రాక్హిల్స్కాలనీలోని రైస్ ఏటీఎం వద్ద ప్రాజెక్ట్ ప్రిషా కోఆర్డినేటర్ యశస్విని జొన్నలగడ్డతో కలిసి దోసపాటి రాము విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దోసపాటి రాము మాట్లాడుతూ నిత్యావసర సరుకులు అందజేయడం ద్వార ఇబ్బందులు తొలగించడం కష్టం అని గ్రహించి ప్రాజెక్ట్ ప్రిషా ద్వార ఇప్పటికి 982 మందికి ఇడ్లీ బండీలు, కొబ్బరి బొండాల షాపులు, పిండి గిర్నీలు, ఇస్త్రీ షాపులు, టీస్టాల్స్, టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేయించామని తెలిపారు.
వెయ్యి కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో యశస్విని జొన్నలగడ్డ ఆలోచన మేరకు ప్రాజెక్ట్ ప్రిషాను ప్రారంభించామని.. మరో పద్దెనిమిది మందికి త్వరలో ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు.
స్నేహితుల ప్రోత్సాహం, సహకారం తీసుకుని ప్రాజెక్ట్ ప్రిషా కోఆర్డినేటర్ యశస్విని జొన్నలగడ్డ అందించిన చేయూతతో కరోనా బారినపడి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

