
మహబూబ్నగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రచురించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా వనపర్తి నియోజకవర్గంలో ఓటర్లుండగా.. ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న నియోజకవర్గంగా షాద్నగర్ నిలిచింది. వనపర్తిలో 2,46,297 ఓటర్లుండగా.. షాద్నగర్లో 2,03, 664మంది ఉన్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో 11,855 మంది యువ ఓటర్లకు (18-19 ఏండ్లు) అవకాశం లభించగా.. వీరు తొలిసారి ఓటేసేందుకు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 62 కాగా.. దేవరకద్ర, నా రాయణపేట నియోజకవర్గాల్లో థర్డ్ జెండర్ ఓటర్లే లేరు.
అసెంబీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు..
