ఉమ్మడి జిల్లాలో 13వేల మందికి కొత్తగా ఓటుహక్కు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాబోయే ఎన్నికలేవైనా విజేతలను, పరాజితులను ఖరారు చేయడంలో అతివలే అత్యంత కీలకం కానున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో 52శాతం మహిళలే ఉన్నారు. ఓటర్ల తుదిజాబితాను భారత ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. గతేడాది వెల్లడించిన ముసాయిదా జాబితా ప్రకారం ప్రజల నుంచి వచ్చిన మార్పులు, చేర్పుల అనంతరం కచ్చితమైన ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. తుది జాబితా ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 19.43 లక్షలమంది ఓటర్లు ఉండగా, వారిలో 10.14 లక్షలమంది మహిళలే. ఈసారి 13వేలమంది యువ ఓటర్లు కొత్తగా ఓటుహక్కును పొందారు.
-నిజామాబాద్, జనవరి 5
(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతి నిధి) :ఓటరు తుది జాబితాను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. గతేడాది వెల్లడించిన ము సాయిదా జాబితా ప్రకారం ప్రజల నుంచి వచ్చిన మార్పులు, చేర్పుల అనంతరం కచ్చితమైన ఓటర్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. ఈసీ గణాంకాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో యువ ఓటర్లు 13వేల మంది ఉన్నారు. వీరందరికీ తొలిసారిగా ఓటు హక్కు కల్పించబడింది. మొత్తంగా 19లక్షల 43వేల 154 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే మ హిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది. పురుషులు 9లక్షల 29వేల 332 మంది ఉన్నారు. మహిళలు 10లక్షల 13వేల 739 మంది ఉన్నట్లుగా తేలింది. రెండు జిల్లాలోనూ ఈసారి థర్డ్ జెండర్ ఓటర్ల సం ఖ్య కాసింత పెరిగింది. నిజామాబాద్లో 31 మం ది, కామారెడ్డిలో 52 మంది ఉన్నారు.
మహిళలే అత్యధికం
నిజామాబాద్ జిల్లాలో 1509 పోలింగ్ స్టేషన్లను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో మొత్తం 13లక్షల 15వేల 26 మంది ఓటర్లు ఉన్నారు. ఫాం-6, ఫాం-6ఏ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు 13,632 మంది ఉన్నారు. ఫాం-7 ప్రకారం డబుల్ ఓట్లు తొలగించేందుకు 13,199 మంది దరఖాస్తు చేసుకు న్నారు. నిజామాబాద్ జిల్లాలో పురుషులు 6లక్షల 23వేల 471 మంది, స్త్రీలు 6లక్షల 91వేల 524 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 31 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 790 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఓటర్లు 6లక్షల 28వేల 128 మంది ఉన్నారు. ఫాం-6, ఫాం-6ఏ ప్రకారం 6,060 మంది వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కును బదిలీ చేయించుకున్నారు. ఫాం-7 ప్రకారం 2,585 మంది అదనంగా ఉన్న ఓటు హక్కును తొలగించుకున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్యలో పురుషులు 3లక్షల 5వేల 861 మంది, స్త్రీలు 3లక్షల 22వేల 215 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ పరిధిలో 52 మంది కి ఓటు హక్కు కల్పించారు. ఇరు జిల్లాల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య ఈసారి పెరిగినట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
యువ ఓటర్లు 13వేల మంది
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తొలిసారిగా దక్కించుకున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో 13 వేల వరకు ఉన్నది. 2022 జనవరి 1వ తారీఖు వరకు 18 ఏండ్లు పూర్తయిన వారందరికీ తుది జాబితాలో చోటు కల్పించారు. గతేడాదిలోనే విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసిన వారి వివరాల ఆధారంగా భారత ఎన్నికల సంఘం ఓటు హక్కును కల్పించింది. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 9,657 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో నూతన ఓటర్లు 3,511 మంది ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్న వారి వయస్సు 18- 19 సంవత్సరాల మధ్యనే ఉండడం విశేషం. నూ తనంగా ఓటరు నమోదు కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఆయా విద్యాసంస్థల్లో ఓటు హక్కు విలువను చాటి చెబుతూ అవగాహన కల్పించడం ద్వారా యువత ముందుకు వచ్చి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.