
అశ్వారావుపేట, జనవరి 5: సామాన్యుడికి బడ్జెట్ అందుబాటులో ఉండే పోషకాహారం గుడ్డు. దీనిలో ప్రోటిన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఎదిగే పిల్లలకు ఇది మంచి పౌష్టికాహారం. శరీర సౌందర్యానికి మంచి సాధనం పోషకాహార లోపం ఉన్న వారు గుడ్డు తింటూ లోపాని అధిగమించవచ్చు. మెదడును ఆరోగ్యంగా ఉంచి మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుడ్డులోని ‘కొబైన్’ అనే న్యూట్రిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని పాస్ఫరస్ ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తుంది. చర్మంపై ముడతలను నివారిస్తుంది. చర్మం ఆరోగ్యాన్ని పెంచుతుంది. దీనిలో విటమిన్ ‘డి’ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులో విటమిన్ ‘ఎ’, ‘ఇ’, ‘డి’, బి-6, బి-12), కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్, థయామిస్, ఫోలిక్ యాసిడ్, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నిషియం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
కంటి సమస్యలు దూరం..
గుడ్డులోని కెరోటినాయిడ్లు, ల్యూటిన్ అనే పోషకాలు కంటికి సంబంధించిన వ్యాధులను దూరం చేస్తాయి. గుడ్డు శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. గుడ్డు తినడం ద్వారా జుట్టును దృఢం చేసుకోవచ్చు. దీనిలో ఉండే పోషకాలు జట్టు పెరుగుదలకు తోడ్పాడతాయి. గుడ్డులో ఉండే ప్రొటీన్లు సత్వర శక్తిని ఇస్తాయి. బరువు పెరగకుండా శరీర బలాన్ని పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్లు తమ మెనూలో గుడ్డును చేర్చుకోవచ్చు. గుడ్డు శరీరానికి కావాల్సిన పోషకాలు, అవసరమైన శక్తిని ఇస్తుంది. గుడ్డులో ఉండే విటమిన్ ‘ఇ’ చర్మ కాంతిని పెంచుతుంది. ప్రోటిన్లు చర్మ కణాలను శుద్ధి చేస్తాయి. గుడ్డు సొనను ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. గుడ్డులో కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్, థయామిస్, ఫోలిక్ యాసిడ్, పాస్ఫరస్, కాపర్, మెగ్నిషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. గుడ్డు తింటే కంటి సమస్యలు రావు. జుట్టు పెరుగుదలకు దోహదపడతుంది. శరీరానికి బలమిస్తుంది. డైటింగ్ చేసే వాళ్లు గుడ్డును మెనూలో చేర్చుకోవచ్చు.