
ఇంటింటికెళ్లి అవగాహన కల్పించిన వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు
జడ్చర్లటౌన్, డిసెంబర్ 16 : కొవిడ్ వ్యా క్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. గురువారం మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ప్రజాప్రతినిధులు, వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్ అవగాహ న కల్పించడంతోపాటు టీకా వేశారు. 8వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. అలాగే కమిషనర్ సునీత పలు వార్డుల్లో వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించారు. అన్ని వార్డుల్లో వ్యా క్సినేషన్ను వేగవంతం చేసినట్లు అర్బన్ హె ల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, డిసెంబర్ 16 : మండలంలోని దేశాయిపల్లిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీవో శంకర్‌నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రా మంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చే యాలని సిబ్బందికి సూచించారు. అర్హులైన ప్రతిఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, డిసెంబర్ 16 : మండలకేంద్రంతోపాటు, మాల్లాపూర్, బోయిన్పల్లి, ము న్ననూర్, వేముల, వాడ్యాల, రాణిపేట తదితర గ్రామాల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు. కా ర్యక్రమంలో డాక్టర్ వంశీప్రియ, వైద్యసిబ్బంది దేవయ్య, జంగయ్య, గీత, రాజేశ్వ రి, పారిజాత, జ్యోతి పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, డిసెంబర్ 16 : మండలంలోని అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు డాక్టర్ ప్రతాప్చౌహాన్ తెలిపారు. వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి టీకా వేస్తున్నట్లు పేర్కొన్నారు.