టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో వణికిస్తున్న నేపథ్యంలో 15-18ఏండ్లలోపు వారికి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు తొలిరోజు సోమవారం వైద్యారోగ్య శాఖ సిబ్బంది జిల్లాలో 3,368 మంది పిల్లలకు టీకాలు వేసింది. జిల్లాకేంద్ర దవాఖాన, 21 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో గుర్తింపు కార్డు ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టింది. మొదటి రోజు రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరిలో టీకాలు వేయడం విశేషం.
యాదాద్రి(ఆలేరుటౌన్), డిసెంబర్ 3 : కరోనా కట్టడి కోసం 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయసున్న యువతీ, యువకులు కొవిడ్ టీకా తప్పక తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సాంబశివరావు సూచించారు. ఆలేరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో సోమవారం కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మాస్క్ లేకుండా బయటికి వెళ్లవద్దన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వైద్యులు శ్రావణ్, క్రాంతికుమార్, సుభాషిణి, కౌన్సిలర్లు బేతి రాములు, కందుల శ్రీకాంత్, రాయపురం నర్సింహులు, సీస రాజేశ్, నాయకులు ఆడెపు బాలస్వామి, బింగి రవి, జూకంటి ఉప్పలయ్య, బైరి మహేందర్ పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో కరోనా వ్యాక్సినేషన్‌ను ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుయతీగౌడ్ ప్రారంభించారు. ఎంపీడీఓ బండారు యాదగిరి, వైద్యాధికారి దీప్తి, సర్పంచులు శ్రీహరి, జైపాల్ రెడ్డి, సుర్వి యాదయ్యగౌడ్, కట్టెల భిక్షపతి, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, భిక్షం, గుండమల్ల సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.
తుర్కపల్లి : మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో వ్యాక్సినేషన్‌ను ఎంపీపీ భూక్య సుశీలారవీందర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్, ఎంపీడీఓ ఉమాదేవి, సర్పంచ్ పడాల వనితాశ్రీనివాస్, జడ్పీటీసీ బోరెడ్డి వనజ, మండల వైద్యాధికారి చంద్రారెడ్డి, హెచ్ఎం శేషగిరిరావు పాల్గొన్నారు.
రాజాపేట : మండల కేంద్రంతో పాటు చల్లూరు, బొందుగుల, సింగారం, పారుపల్లి, నెమిల, బేగంపేట పాఠశాలల్లో, సరస్వతి కళాశాలలో 15 ఏండ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేశారు. మొత్తం 132 మంది విద్యార్థులకు టీకాలు వేసినట్లు మండల వైద్యాధికారి శివవర్మ తెలిపారు.
ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీకా కేంద్రాన్ని ఎంపీపీ తండ మంగమ్మ ప్రారంభించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏఎన్ఎం మహేశ్వరి టీకాలు వేశారు. జడ్పీటీసీ నరేందర్‌గుప్తా, సర్పంచ్ జన్నాయికోడె నగేశ్, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ నవ్య, ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌రెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు.
అడ్డగూడూరు : మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపీపీ దర్శనాల అంజయ్య ప్రారంభించారు. సోమవారం మొత్తం 65 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి నరేశ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భారతమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
గుండాల : మండల కేంద్రంలోని మోడల్స్కూల్లో వ్యాక్సినేషన్‌ను ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్బాబు ప్రారంభించారు. ఎంపీడీఓ శ్రీనివాసులు, మండల వైద్యాధికారి డా.శ్రీనివాస్, సర్పంచులు పందుల రేఖ, దార సైదులు, ఎంపీటీసీ కుంచాల సుశీల, ప్రిన్సిపాల్ డా.సురేశ్‌కుమార్, నాయకులు చిందం ప్రకాశ్ పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండలంలోని బొమ్మలరామారం, జలాల్పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టీకా కార్యక్రమాన్ని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఈఓ చక్రవర్తుల రంగరాజన్, సర్పంచ్ సంగిశెట్టి వెంకటేశ్, ఎంపీటీసీ మడిగె నర్సింహ, హెచ్ఎంలు ఉపేంద్ర, పెండెం నాగార్జున, వైద్యాధికారులు శ్రావణ్‌కుమార్, క్రాంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీకాను సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరి అర్బన్ : 15 సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వం ఇచ్చే కొవిడ్ టీకాను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయలు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళాశాలలో 116 మంది విద్యార్థులకు టీకా వేసినట్లు వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య, కౌన్సిలర్ క్రాంతి అవంచక, కళాశాల ప్రిన్సిపాల్ డి.పాపిరెడ్డి, వైద్యాధికారి లీలావతి, టీఆర్ఎస్ నాయకుడు బాషబోయిన రాజేశ్, గాదె శ్రీనివాస్ పాల్గొన్నారు.
బీబీనగర్ : మండలంలోని రాఘవపురంలో టీకా కార్యక్రమాన్ని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమస్థాయూ సంఘం చైర్మన్, బీబీనగర్ జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి ప్రారంభించారు. ఎంపీపీ యెర్కల సుధాకర్‌గౌడ్, బీబీనగర్ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, టీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు ఎలుగల నరేందర్, డాక్టర్ దాక్షాయణి పాల్గొన్నారు.
ఎయిమ్స్‌లో ప్రారంభించిన డైరెక్టర్ వికాస్ భాటియా
ఎయిమ్స్ ఆస్పత్రిలో టీకా కార్యక్రమాన్ని వైద్యశాల డైరెక్టర్ వికాస్ భాటియా ప్రారంభించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ నీరజ్ అగర్వాల్, డాక్టర్ కళ్యాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పీఆర్ఓ శ్యామల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా 3,368 మందికి ..
భువనగిరి అర్బన్ : 15 నుంచి 18 సంవత్సరాలలోపు వారికి కొవిడ్ టీకా వేసే కార్యక్రమం సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 40 వేల మంది టీనేజర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారికి టీకా వేసేందుకు జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు 21 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి టీకా వేస్తున్నారు. మొదటి రోజు రాత్రి 8 గంటల వరకు 3,368 మందికి టీకా వేసినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. టీనేజర్ల టీకా కార్యక్రమంలో తొలిరోజు యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
రిజిస్ట్రేషన్ ఇలా..
నేరేడుచర్ల, జనవరి 3 : కరోనాను కట్టడి చేసేందుకు టీకా ఒక్కటే పరిష్కారం. ఇప్పటి వరకు 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం ప్రస్తుతం 15 నుంచి 18 ఏండ్లలోపు వారికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హులైన వారు కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. టీనేజర్లకు ఓటర్ ఐడీ, పాన్‌కార్డులు లేనందున ఆధార్, విద్యాసంస్థల గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆధార్ లేకుంటే పదో తరగతి ఐడీ నంబర్‌ను కూడా ఉపయోగించవచ్చు. తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను వినియోగించుకోవచ్చు. టీనేజర్లకు ప్రస్తుతం కొవాగ్జిన్ ఒక్కటే అందుబాటులో ఉన్నది. ఇప్పటికే వైద్యశాఖ సిబ్బంది స్కూల్, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. పాఠశాలలు, కళాశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. నెలాఖరు వరకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా వైద్యశాఖ చర్యలు చేపట్టింది.
కొవిన్ యాప్‌లోనే..
కొవిన్ యాప్ లేదా selfregis- tration. cow in.gov.in పోర్టల్‌లోకి వెళ్లి ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఓటీపీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఒక్క ఫోన్ నంబర్‌పై నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పిల్లల ఆధార్ లేదా పదో తరగతి ఐడీ నంబర్‌ను ఇవ్వాలి. నంబర్ వెరిఫై అయ్యాక రిజిస్ట్రేషన్ పేజీ వస్తుంది. ఇందులో పేరు, పుట్టిన తేదీ, లింగం తదితర వివరాలను నమోదు చేయాలి. వివరాలన్నీ నమోదు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
టీకా తప్పక తీసుకోవాలి
చౌటుప్పల్ , డిసెంబర్ 3 : 15 సంవత్సరాలు పైబడిన వారంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అప్పుడే కొవిడ్‌ను కట్టడి చేయడం సాధ్యమని మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు సూచించారు. పట్టణంలోని బాలికల గరుకుల పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, మండల వైద్యాధికారి డా. శివప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సరోజనమ్మ, కౌన్సిలర్లు ఎండీ బాబాషరీఫ్, గోపగోని లక్ష్మణ్‌గౌడ్ పాల్గొన్నారు.
మోత్కూరు : మున్సిపాలిటీ కేంద్రంలోని పీహెచ్సీలో టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. 15 నుంచి 17ఏండ్లలోపు 42 మందికి,18 ఏండ్ల వయసున్న 62 మందికి టీకా వేసినట్లు వైద్యాధికారి గీత తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మహమూద్, వైస్ చైర్మన్ వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు పసల విజయ సిబ్బంది పాల్గొన్నారు.