మన్సూరాబాద్ : కరోనా నుంచి రక్షణ పొందేందుకు పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులకు విధిగా వ్యాక్సినేషన్ చేయించాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
మన్సూరాబాద్ డివిజన్ ప్రెస్ కాలనీలోని ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రంలో 12 నుంచి 14 వయస్సు గల పిల్లలకు చేస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకా తీసుకునే విషయంలో పిల్లలు ఎలాంటి భయాందోళనకు గురవ్వకుండా వారిని తల్లిదండ్రులు సన్నద్ధం చేయాలని సూచించారు.టీకా తీసుకోవడం ద్వార భవిష్యత్తులో కరోనా బారినపడకుండా ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పులేందర్ నాయుడు, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు పోచబోయిన జగదీష్‌యాదవ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్‌రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, భాస్కర్‌యాదవ్, జెట్టి అశోక్‌యాదవ్, ఆనంద్, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
అలాగే స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.